AP JOBS: ఏపీ శ్రీకాకుళంలో 60 ఉద్యోగాలు, అర్హతలివే!
శ్రీకాకుళంకు పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
శ్రీకాకుళంకు పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 60
పోస్టుల వారీగా ఖాళీలు..
1. జూనియర్ అసిస్టెంట్: 04
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.18500 చెల్లిస్తారు.
2. రిసెప్షన్-కమ్- రిజిస్ట్రేషన్ క్లర్క్: 04
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.18500 చెల్లిస్తారు.
3. ఓటీ అసిస్టెంట్: 04
అర్హత: 7వ తరగతి ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
4. డయాలిసిస్ టెక్నీషియన్: 10
అర్హత: డిప్లొమా ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.32670 చెల్లిస్తారు.
5. ల్యాబొరేటరీ టెక్నీషియన్: 04
అర్హత: టీఎంఎల్‌టీ/ బీఎస్సీ ఎంఎల్‌టీ ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.28000 చెల్లిస్తారు.
6. సీఆర్మ్ టెక్నీషియన్: 04
అర్హత: డీఎంఐటీ కోర్సు ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.32670 చెల్లిస్తారు.
7. సోషల్ వర్కర్: 02
అర్హత: బీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ ఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.21500 చెల్లిస్తారు.
8. సపోర్టింగ్ స్టాఫ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 22
అర్హత: ఎస్ఎస్‌సీ/ 10వ తరగతి ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
9. సెక్యూరిటీ గార్డ్/ జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 06
అర్హత: ఎస్ఎస్‌సీ/ 10వ తరగతి ఉ్తతీర్ణత.
జీతభత్యాలు: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: Superintendent, GGH, Srikakulam.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2023.
దరఖాస్తు చివరి తేది: 31.03.2023.
Also Read:
ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారికి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 23, 24 తేదీల్లో ఐబీల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-1 రాతపరీక్ష నిర్వహించనడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఏర్పాట్లు చేస్తోంది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్‌వీఎన్‌ఐటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనీద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) స్టెనో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్‌లోని లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏఎస్ఐ స్టెనో ఉద్యోగాల భర్తీకి మార్చి 27న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..