DME AP Recruitment 2021: ఏపీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్..
విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ విధానాల ద్వారా వీటిని భర్తీ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ విధానాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. రేడియో డయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జూన్ 27వ తేదీన ప్రారంభం కాగా.. ఆగస్టు 11న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. అర్హులైన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://dme.ap.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విద్యార్హత వివరాలు..
సంబంధిత స్పైషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్/ డీఎం/ ఎంసీహెచ్/ డీఎన్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. క్లినికల్ స్పెషాలిటీ చేసిన అభ్యర్థులు ఏడాది పాటు సీనియర్ రెసిడెన్సీ చేసి ఉండటం తప్పనిసరి అని పేర్కొంది.
విభాగాల వారీగా ఖాళీలు..
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (32): రేడియో డయాగ్నసిస్- 14, ఎమర్జెన్సీ మెడిసన్- 3, కార్డియాలజీ- 7, ఎండోక్రైనాలజీ- 1, గ్యాస్ట్రో ఎంట్రోలజీ- 4, కార్డియో థేరోకిక్ సర్జరీ/ సీవీటీఎస్- 2, యూరోలజీ- 1
లేటరల్ ఎంట్రీ (17): రేడియో డయాగ్నసిస్/ రేడియాలజీ- 8, ఎమర్జెన్సీ మెడిసిన్- 2, ట్రాన్స్ ఫూజన్ మెడిసిన్- 1, కార్డియాలజీ- 5, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ- 1
ఎంపిక చేస్తారిలా..
క్వాలిఫైయింగ్ పీజీ డిగ్రీ లేదా సూపర్ స్పెషాలిటీ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులతో పాటు ఇతర వివరాల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మార్కులు ఉండవు.
వయో పరిమితి..
జూలై 27, 2021 నాటికి ఓసీ అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయస్సు 47 ఏళ్లకు మించకూడదు. ఇక దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 52 ఏళ్లుగా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 50 ఏళ్లకు మించరాదని తెలిపింది. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000.. మిగతావారు రూ.1500 చెల్లించాలి.
తిరుపతి ఎస్‌వీవీయూలో ఖాళీలు..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. జిల్లాకు 1 చొప్పున మొత్తం 13 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనుంది. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండేళ్ల పాటు డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు ఏపీ పారా మెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
బీఎంఎల్టీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.17500 జీతం చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపులను ఆగస్టు 1 లోగా చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం www.svvu.edu.in సంప్రదించవచ్చు.