Prakasam District Jobs: ప్రకాశం జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగంలో ఉద్యోగాలు - అర్హతలు, ఖాళీల వివరాలు ఇలా
ఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒంగోలులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులవారీగా పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 10
➥ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: పీజీ డిగ్రీ(సోషల్ వర్క్-ఎంఎస్‌డబ్ల్యూ)/ మాస్టర్ డిగ్రీ (సైకాలజీ)/ ఎంఏ (సోషియాలజీ)/ ఎంఎస్సీ (హోంసైన్స్-ఛైల్డ్ డెవలప్‌మెంట్).
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: రూ.44,023.
➥ ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
అర్హత: పీజీ డిగ్రీ(సోషల్ వర్క్-ఎంఎస్‌డబ్ల్యూ)/ మాస్టర్ డిగ్రీ (రూరల్ డెవలప్‌మెంట్)/ సైకాలజీ/ఎంఎస్సీ (హోంసైన్స్).
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.27,804.
➥ లీగల్ కమ్ ప్రొహిబిషన్ ఆఫీసర్: 01
అర్హత: ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.27,804.
➥ సోషల్ వర్కర్ (మెన్): 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ (సోషల్ వర్క్/ఎంఎస్‌డబ్ల్యూ) లేదా పీజీ (సైకాలజీ).
జీతం: రూ.18,536.
➥ డేటా అనలిస్ట్: 01
అర్హత: డిగ్రీ (ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్).
అనుభవం: డేటా మేనేజ్‌మెంట్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.18,536.
➥ అవుట్‌రీచ్ వర్కర్ (ఉమెన్): 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (సోషల్ వర్క్, చైల్డ్ డెవలప్‌మెట్)
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: రూ.10,592.
➥ నర్సు: 01
అర్హత: ఏఎన్‌ఎమ్ ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: రూ.11,916.
➥ డాక్టర్ (పార్ట్ టైమ్): 01
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. పీడియాట్రిక్ మెడిసిన్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
జీతం: రూ.9,930.
➥ చౌకీదార్(ఉమెన్): 01
అర్హత: నిబద్ధత, చురుకైన వ్యక్తి అయి ఉండాలి. మద్యం తాగడం, గుట్కా తినడం లాంటి అలవాట్లు ఉండకూడదు. గతంలో ఎలాంటి వివాదాలు ఉండకూడదు.
జీతం: రూ.7,944.
➥ డేటా ఎంట్రే ఆపరేటర్: 01
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు డిప్లొమా (కంప్యూటర్ అప్లికేషన్) అర్హత ఉండాలి.
అనుభవం: డేటా ఎంట్రీ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతం: రూ.11,916.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు (47 సంవత్సరాల వరకు) వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Project Director,
District Women and Child Development Agency,
Ongole, Prakasam District.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రారంభం: 09.11.2023.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 22.11.2023.
ALSO READ:
➥ గుంటూరు జిల్లాలో మెడికల్, పారామెడికల్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
➥ కృష్ణా జిల్లాలో 164 పారామెడికల్ పోస్టులు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా