CPT Exam: ‘కారుణ్య’ ఉద్యోగులకు 'నైపుణ్య' పరీక్ష తప్పని సరి, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కారుణ్య' నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారి విషయంలో కీలక నిర్ణయిం తీసుకుంది. వారికి కంప్యూటర్ నైపుణ్య పరీక్ష (సీపీటీ)లో తప్పనిసరి చేసింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'కారుణ్య' నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారి విషయంలో కీలక నిర్ణయిం తీసుకుంది. కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష (సీపీటీ)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జులై 25న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. అయితే 2023 ఫిబ్రవరి 24 తర్వాత కారుణ్య నియామకాలు పొందిన వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కారుణ్య నియామకాల కింద టైపిస్టు, లోయర్ డివిజన్ టైపిస్టు, అప్పర్ డివిజన్ టైపిస్టు, టైపిస్టు-కం-అసిస్టెంట్ పోస్టులు పొందిన వారు ఇంగ్లిష్, తెలుగు టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఇప్పటివరకూ ఉండేది. తాజా ఉత్తర్వులతో పాత విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.
ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా సీపీటీలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీసును క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు జులై 24న జారీచేసిన ఉత్తర్వుల్లో ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ నిబంధనలను సవరించింది.
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పలు దఫాలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు తాజా ఉత్తర్వులు వెలువడినట్లు సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ:
ఆగస్టు 2 నుంచి 'గ్రూప్-1' అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, పూర్తి షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 2 నుంచి 11 వరకు ప్రతిరోజు 30 మంది అభ్యర్థుల చొప్పున, చివరి రోజు మాత్రం 10 మందికి ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తేదీలవారీగా అందుబాటులోఉంచింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రోజుకు రెండు షిఫ్టుల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 111 సూపర్‌వైజర్&జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, అర్హతలివే!
దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial