CCIL: గుంటూరు- కాటన్ కార్పొరేషన్‌లో సెమీస్కిల్డ్/అన్‌స్కిల్డ్ పర్సన్ పోస్టులు, అర్హతలివే
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన సెమీస్కిల్డ్/అన్‌స్కిల్డ్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుంటూరులోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన సెమీస్కిల్డ్/అన్‌స్కిల్డ్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. నవంబరు 2,3 వ తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
* సెమీస్కిల్డ్/అన్‌స్కిల్డ్ పర్సన్ పోస్టులు
కాంట్రాక్ట్ వ్యవధి: 85 రోజులు.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 21 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకి చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, పదోతరతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
జీతం: నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 28.10.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 12:00 గంటల్లోపు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక:
➥ గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందినవారికి గుంటూరులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
THE COTTON CORPORATION OF INDIA LTD.
Kapas Bhavan,
4/2 Ashok Nagar,
P.B NO: 227,
GUNTUR-522002.
➥ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు చెందినవారికి ఆదోని(కర్నూలు)లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
THE COTTON CORPORATION OF INDIA LTD,
C/o. Agricultural Market Committee,
Madavarama Raod,
ADONI, Kurnool District-518 301.
ALSO READ:
సశస్త్ర సీమాబల్‌లో 111 సబ్ఇన్‌స్పెక్టర్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా
సశస్త్ర సీమాబల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోగలరు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఉద్యో గాలకు ఎంపికైనవారు ఏ ప్రాంతాల్లో అయినా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. పోస్టులవారీగా డిగ్రీ, ఇంటర్, నర్సింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
శ్రీహరికోట-సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డీఎస్సీ షార్ సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నెలకు రూ.79,662 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..