CBSE Recruitment: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో 212 గ్రూప్ బి& సి పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి
CBSE Jobs: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు ఉన్నవారు జనవరి 31 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
CBSE Recruitment: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్ బి& సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 212 సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఇంగ్లిష్, హింది కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, స్కిల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 212
✦ గ్రూప్ బి పోస్టులు
సూపరింటెండెంట్: 142 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 21 పోస్టులు, ఎస్టీ- 10 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 38 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 14 పోస్టులు, యూఆర్- 59 పోస్టులు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమానంతో పాటు కంప్యూటర్/కంప్యూటర్ అప్లికేషన్స్, విండోస్, ఎంఎస్- ఆఫీస్, లార్జ్ డేటాబేస్ నిర్వహణ, ఇంటర్నెట్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
✦ గ్రూప్ సి పోస్టులు
జూనియర్ అసిస్టెంట్: 70 పోస్టులు
రిజర్వేషన్: ఎస్సీ- 09 పోస్టులు, ఎస్టీ- 09 పోస్టులు, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 34 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 13 పోస్టులు, యూఆర్- 05 పోస్టులు.
అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఇంగ్లిష్, హింది కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఎంసీక్యూ ఆధారిత ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్స్ (ఆబ్జెక్టివ్ టైప్ (ఓఎంఆర్ బేస్‌డ్) లేదా డిస్క్రిప్టివ్ టైప్) పరీక్షలు, స్కిల్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్ తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్ర ప్రదేశ్ - విజయవాడ, అస్సాం- గౌహతి, బీహార్- పాట్నా, చండీగఢ్- చండీగఢ్ / పంచకుల, ఢిల్లీ- ఢిల్లీ / నోయిడా, కర్నాటక- బెంగుళూరు, కేరళ- తిరువనంతపురం, మధ్యప్రదేశ్- భోపాల్, మహారాష్ట్ర- పూణె, ఒడిషా- భువనేశ్వర్, రాజస్థాన్- అజ్మీర్, తమిళనాడు- చెన్నై, ఉత్తర ప్రదేశ్- ప్రయాగ్రాజ్ (అలహాబాద్), ఉత్తరాఖండ్- డెహ్రాడూన్.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.01.2025.