By: ABP Desam | Updated at : 30 Jul 2021 10:32 AM (IST)
AP Jobs Recruitment
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీని ఆదేశించింది. విభాగాల వారీగా జారీ చేసే పోస్టుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉంది.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు..
యునానీ విభాగంలో మెడికల్ ఆఫీసర్- 26
హోమియోపతి విభాగంలో మెడికల్ ఆఫీసర్- 53
ఆయుర్వేద విభాగంలో మెడికల్ ఆఫీసర్- 72
హోమియో విభాగంలో లెక్చరర్ పోస్టులు- 24
ఆయుష్ విభాగం డాక్టర్ ఎన్‌ఆర్‌ఎస్‌జీఏసీలో లెక్చరర్- 3
జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్- 670
అసిస్టెంట్ ఇంజనీర్లు- 190
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్ 3 (ఎండోమెంట్)- 60
హార్టికల్చర్ ఆఫీసర్- 39
తెలుగు రిపోర్టర్ (లెజిస్లేచర్)- 5
డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 4
ఇంగ్లిష్ రిపోర్టర్ (లెచిస్లేచర్)- 10
జూనియర్ లెక్చరల్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 10
డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ- 5
అసిస్టెంట్ కన్జర్వేటర్, ఫారెస్టు సర్వీస్- 9
మొత్తం- 1180
ఏపీ ఆరోగ్య శాఖలో 3,393 పోస్టుల భర్తీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు 3,393 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు విధానంలో జోన్ల వారీగా ఈ నియమకాలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం... ఈ పోస్టులను నవంబరు నెలలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ పోస్టులను ముందుగానే భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి దీనికి సంబంధించిన అధికారికంగా సమాచారం రాగానే పోస్టుల భర్తీ ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది.
మరింత చదవండి: ఏపీ ఆరోగ్య శాఖలో 3,393 పోస్టుల భర్తీ! ఆగస్టులో నోటిఫికేషన్..
AP Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 351 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అర్హతలివే!
Anganwadi Posts: ఇంటర్ ఉంటేనే 'అంగన్వాడీ' ఉద్యోగం, త్వరలో 5 వేలకు పైగా పోస్టుల భర్తీ!
Visakha Agni veer Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విశాఖలో 18 రోజుల పాటు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ
AP SACS Jobs: ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో 140 ఖాళీలు - టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతలు!
AP Jobs: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు, వివరాలివే!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!