By: ABP Desam | Updated at : 26 Jul 2021 03:39 PM (IST)
Doctor (symbolic)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రానుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దాదాపు 3,393 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు విధానంలో జోన్ల వారీగా ఈ నియమకాలు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం... ఈ పోస్టులను నవంబరు నెలలో భర్తీ చేయాల్సి ఉంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ పోస్టులను ముందుగానే భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ నుంచి దీనికి సంబంధించిన అధికారికంగా సమాచారం రాగానే పోస్టుల భర్తీ ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది.
జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య..
శ్రీకాకుళం జిల్లా- 209
కృష్ణా- 268
గుంటూరు- 310
ప్రకాశం- 240
తూర్పు గోదావరి-440
పశ్చిమ గోదావరి- 295
విజయనగరం- 176
విశాఖపట్నం- 248
నెల్లూరు- 236
చిత్తూరు- 275
కడప- 202
అనంతపురం- 258
కర్నూలు జిల్లా- 236
నెలకు రూ.25 వేల వేతనం..
బీఎస్సీ నర్సింగ్ డిగ్రీని 6 నెలల కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ కోర్సుతో పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోర్సు పూర్తి చేసిన వారు 4,500 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈ పోస్టులకు కాంపిటేషన్ తక్కువగా ఉంది. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేసి.. వారిని ఉప ఆరోగ్య కేంద్రాల్లో విధులు కేటాయిస్తుంది. ఎంపికైన వారికి నెల వేతనం రూ.25,000 వరకూ ఉంటుంది. పని తీరు ఆధారంగా నెలకు అదనంగా రూ.15,000 బెనిఫిట్స్ అందుకునే ఛాన్స్ కూడా ఉంది.
మరికొన్ని పోస్టులు కూడా..
ప్రస్తుత కోవిడ్ సమయంలో రాష్ట్రంలో వైద్య వసతుల కొరత ఏర్పడింది. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల వైద్య చికిత్సకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో పలు ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది.
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంఎల్‌హెచ్‌పీలతో పాటుగా... 54 స్పెషలిస్టు వైద్యులు, 683 మెడికల్ ఆఫీసర్లు, 1,062 స్టాఫ్ నర్సులు, 380 ల్యాబ్ టెక్నీషియన్లు, 384 పారామెడికల్, 42 ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై ఇప్పటికే జిల్లాలకు సమాచారాన్ని పంపించినట్లు సమాచారం. త్వరలోనే ఈ నియామకాలు కూడా ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.
TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?
Private Jobs: ప్రైవేటు ఉద్యోగాలు - డిగ్రీ, పీజీ అర్హతలు, ఇలా అప్లై చేయండి!
TS SI Preliminary Exam 2022: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ రాత పరీక్ష, 91.32 శాతం మంది హాజరు!
AP Govt Jobs : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, 42 రకాల పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్!
TS SI Preliminary Exam 2022: ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ - ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించరు, మాస్క్ తప్పనిసరి
Sajjala On Gorantla : ఫిర్యాదు లేదు - చర్యలుండవ్ ! గోరంట్ల మాధవ్ విషయంలో సజ్జల క్లారిటీ
India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!