Bose Institute: బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ ఉద్యోగాలు, వివరాలు ఇలా!
సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కోల్‌కతాలోని బోస్ ఇన్‌స్టిట్యూట్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా ప్రొఫెసర్, అసోసియేట, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. బయోలాజికల్, కెమికల్, ఫిజికల్ సైన్సెస్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు. సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 12
➥ ప్రొఫెసర్: 03 పోస్టులు
➥ అసోసియేట్ ప్రొఫెసర్: 06 పోస్టులు
➥ అసిస్టెంట్ ప్రొఫెసర్: 03 పోస్టులు
విభాగాలు: బయోలాజికల్, కెమికల్, ఫిజికల్ సైన్సెస్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డాక్టరేట్ డిగ్రీ అర్హత ఉండాలి.
అనుభవం:
* ప్రొఫెసర్ పోస్టులకు 10 సంవత్సరాల రిసెర్చ్ అనుభవం, సంబంధిత విభాగంలో పబ్లికేషన్ ఉండాలి.
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 8 సంవత్సరాలు, సంబంధిత విభాగంలో పబ్లికేషన్ ఉండాలి.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 6 సంవత్సరాలు లేదా లెక్చరర్ గ్రేడ్ అభ్యర్థులకు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. సంబంధిత విభాగంలో పబ్లికేషన్ ఉండాలి.
వయోపరిమితి: ప్రొఫెసర్ పోస్టులకు 45 సంవత్సరాలు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 40 సంవత్సరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 38 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు నింపిన తర్వాత ప్రింట్ తీసి సంతకం చేయాలి. అవసరమైన అన్ని అటెస్టేషన్, ఇతర డాక్యుమెంట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director, Bose Institute,
Unified Academic Campus,
Block-EN 80, Sector-V, Salt Lake,
Kolkata-700091.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.12.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.01.2023.
Also Read:
ఇస్రోలో 526 ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 526 అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో హైదరాబాద్ పరిధిలో 54 పోస్టులు, శ్రీహరికోటలో 78 పోస్టులు ఉన్నాయి. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 9 లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌జేవీఎన్‌లో 80 ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సత్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్‌జేవీఎన్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/ బీటెక్/ బీఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 21 నుంచి జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

