Central Jobs: కేంద్రంలో 10 లక్షల ఖాళీలు, అత్యధిక పోస్టులు ఈ విభాగంలోనే! లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి!
022 ఆగస్టు నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్-ఎ పోస్టులు, 1.18 లక్షల గ్రూప్-బి పోస్టులు, 8.36 లక్షల గ్రూప్-సి పోస్టులు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఏకంగా 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర శాఖలు, పీఎస్‌యూల్లో ఖాళీల సంఖ్యపై కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఈ మేరకు లోక్‌సభలో డిసెంబరు 7న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఆగస్టు నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మొత్తం పోస్టుల్లో 23,584 గ్రూప్-ఎ పోస్టులు, 1.18 లక్షల గ్రూప్-బి పోస్టులు, 8.36 లక్షల గ్రూప్-సి పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. పదవీవిరమణ, పదోన్నతి, రాజీనామా, మృతి కారణాలతో ఈ ఖాళీలు ఏర్పడినట్టు వివరించారు.
ఈ ఏడాది ఆగస్టు నాటికి రైల్వే శాఖలో 2,93,943, రక్షణ (సివిల్) శాఖలో 2,64,704, హోంశాఖలో 1,43,536 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ‘రైల్వేలో మొత్తం 15,14,007 పోస్టులు ఉండగా, 2,93,943 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేలో 12,20,064 మంది ఉద్యోగులు ఉన్నారు. డిఫెన్స్ (సివిల్)లో 6,46,042 పోస్టులు ఉండగా, 2,64,707 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హోంశాఖలో 10,85,728 పోస్టుల్లో 1,43,536 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని వెల్లడించారు.
గత ఐదేండ్లలో యూపీఎస్సీ, ఎస్సెస్సీ ద్వారా కేంద్రం 2,46,914 పోస్టులనే భర్తీ చేసింది.
కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు:
కేటగిరీ | పోస్టులు |
గ్రూప్ - ఎ | 23,584 |
గ్రూప్ - బి | 1,18,807 |
గ్రూప్ - సి | 8,36,936 |
మొత్తం | 9,79,327 |
పీఎంవోలో 129 ఖాళీలు
ప్రధానమంత్రి కార్యాలయంలో 446 పోస్టులు ఉండగా, 129 ఖాళీలు ఉన్నాయని, రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో 380 పోస్టులకుగానూ 91 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా 1.47 లక్షల కొత్త నియామకాలు జరిగాయని వెల్లడించారు.
Also Read:
SSC CHSL-2022 నోటిఫికేషన్ విడుదల - 4500 కేంద్ర కొలువుల భర్తీ! పరీక్ష, ఎంపిక విధానం ఇలా!
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల మేళా, 13404 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబరు 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..