AP Police Constable Hall Tickets: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్!
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించినున్న ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను రాష్ట్ర పోలీసు నియామక మండలి జనవరి 12న విడుదల చేయనుంది. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట‌్‌లో అభ్యర్థి వివరాలతోపాటు పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు.
కాగా రాష్ట్రంలో 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 14న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ జనవరి 18తో ముగియనుంది. ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి- slprb.ap.gov.in.
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Recruitment' పేజీలోకి వెళ్లాలి.
➥ అక్కడ కనిపించే 'SCT PC (CIVIL) (MEN & WOMEN), SCT PC (APSP) admit card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ వివరాలు సమర్పించాలి.
➥ స్క్రీన్ మీద అభ్యర్థి, పరీక్ష వివరాలతో కూడిన హాల్‌టికెట్ దర్శనమిస్తుంది.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసకొని, ప్రింట్ తీసుకోవాలి.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ వెంటతీసుకురావాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును తీసుకెళ్లాలి.
ప్రిలిమినరీ పరీక్ష విధానం:
➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.
➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.
➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.
➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.
➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 12 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..