అన్వేషించండి

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

ఎస్ఐ పోస్టులకు  దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించనున్నారు.

ఏపీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఏపీ పోలీస్ నియామక మండలి ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎస్ఐ పోస్టులకు  దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్-1; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 421 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 1,40,453 మంది పురుషులు ఉండగా.. 32,594 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.01.2022.

➥ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్: 05.02.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేది: 19.02.2023.

Notification 

Website 

Also Read:

కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లకు 95,208 మంది అభ్యర్థులు ఎంపిక! స్టేజ్-2 దరఖాస్తు షెడ్యూలు ఇదే!
ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.
ఫలితాలు, ఫిజికల్ ఈవెంట్ల షెడ్య్యూలు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Embed widget