APSCSCL: ఏపీఎస్సీఎస్సీఎల్, విజయనగరంలో అకౌంటెంట్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
APSCSCL Jobs: విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
APSCSCL, Vizianagaram District Recruitment: విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా లేదా నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 11
* అకౌంటెంట్ గ్రేడ్-III: 03 పోస్టులు
అర్హత: ఎంకామ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేని యెడల, నాన్-లోకల్ అభ్యర్థులతో ఖాళీలను భర్తీచేస్తారు.
జీతం: రూ.27,000.
* డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేని యెడల, నాన్-లోకల్ అభ్యర్థులతో ఖాళీలను భర్తీచేస్తారు.
జీతం: రూ.18,500.
* టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-III: 07 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, రిజర్వ్‌డ్ అభ్యర్థులకు 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఉద్యోగాల భర్తీకి సంబంధించి లోకల్ అభ్యర్థులు అందుబాటులో లేని యెడల, నాన్-లోకల్ అభ్యర్థులతో ఖాళీలను భర్తీచేస్తారు.
జీతం: రూ.22,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా లేదా నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎంపిక విధానం: అర్హతలు, వయోపరిమితి, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
చిరునామా: The District Office Civil Supplies Manager,
APSCSCL, Dasannapet, Vizianagaram.
ఈమెయిల్: dmvzm.apscsc@ap.gov.in
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.11.2023.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 04.12.2023.
➥ అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దరఖాస్తు, సర్టిఫికేట్ల పరిశీలన: 05.12.2023.
➥ టెక్నికల్ అసిస్టెంట్ దరఖాస్తు, సర్టిఫికేట్ల పరిశీలన: 06.12.2023.
ALSO READ:
నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1,104 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్ఆర్‌సీ)- నార్త్ ఈస్ట్రన్ రైల్వే ఎన్‌ఈఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply