APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్ తిరుపతి జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
APSCSCL Recruitment: తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయం తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులని అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
➥ టెక్నికల్ అసిస్టెంట్
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ హెల్పర్
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 సంవత్సరాలు; హెల్పర్‌కు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్‌లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.10.2023.
ALSO READ:
ఆప్కాబ్‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 16న ప్రారంభంకాగా.. అక్టోబరు 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తు గడువును అక్టోబరు 21 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు అక్టోబరు 21లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పీవో పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..