APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Andhra Pradesh Govt Jobs | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది.

APPSC Recruitment Notifications | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు పోస్టులకు కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది. అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. పలు దశల్లో ఈ నియామకాలను పూర్తి చేసేందుకు ప్లాన్ రూపొందించింది. ప్రస్తుతం 20 శాఖలకు సంబంధించిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మిగిలిన ఐదు శాఖల పోస్టులకు రేపు, మరో పది శాఖల ఉద్యోగాలకు ఈ నెల 24న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ వివరాలు ఇలా ఉన్నాయి
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా పలు కీలక శాఖలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అటవీ శాఖ పరిధిలో 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులతో పాటు 20 డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్-2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఖాళీలతో పాటు 29 సూపర్ వైజర్ గ్రేడ్-1 పోస్టులు.. పరిశ్రమల శాఖలో 78 ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, జైళ్లు-పరిశీలనా విభాగంలో 15 డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్స్ గ్రేడ్-2, దేవాదాయ శాఖలో (ఎండోమెంట్స్) 104 గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























