APPSC: మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలుంటే తెలపొచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన పరీక్షల ఆన్సర్ కీలలో మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం, హోమియో, యునానీ), లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (ఆయుర్వేదం, హోమియో) పోస్టులకు సంబంధించినవి ఉన్నాయి. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
ప్రాథమిక ఆన్సర్ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. పోస్ట్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో సమర్పించే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు.
రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
- General Studies & Mental ability
- Paper II Common Test for Various Posts in Homeopathy
- Paper II Pharmacy
- Paper II Materia Medica
- Paper II Organon of medicine and principles of homoeopathic philosophy and psychology
- Paper II Repertory and casetaking
ALso Read:
గ్రూప్ -4 మెయిన్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-4 మెయిన్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. గ్రూప్-4 మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఆన్సర్ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఏప్రిల్ 7 నుంచి 9 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. పోస్ట్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్, ఫోన్, వ్యక్తిగతంగా సమర్పించడం తదితర రూపాల్లో సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్యభట్టు తెలిపారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2674 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్‌గా చేయగలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..