అన్వేషించండి

APPSC Group2 Recruitment: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, సిలబస్‌లో భారీ మార్పులు!

ఏపీలో 'గ్రూప్-2' అభ్యర్థులకు ప్రిపేప్ అయ్యే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 'గ్రూప్-2' పోస్టుల రాత పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.

ఏపీలో 'గ్రూప్-2' అభ్యర్థులకు ప్రిపేప్ అయ్యే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలకు సంబంధించి తాజాగా కొత్త సిలబస్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రాథమిక (స్క్రీనింగ్) పరీక్ష, రెండో దశలో 300 మార్కులకు  ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అయితే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన సిలబస్‌లో కీలక మార్పులు చేసింది.

కొత్త సిలబస్ ప్రకారం.. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం... 150 మార్కులకు ప్రాథమిక పరీక్ష ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక 300 మార్కులకు నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరు 150 మార్కులకు ఉంటుంది. వీటిలో పేపర్-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉంటాయి. అదేవిధంగా  పేపర్-2లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష విధానం  ఇలా..

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు పరీక్ష సమయం (నిమిషాల్లో)
భారతదేశ చరిత్ర(ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర) 30 30 30
భూగోళశాస్త్రం(జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ) 30 30 30
భారతీయ సమాజం(స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం 30 30 30
కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు) 30 30 30
మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ) 30 30 301
మొత్తం 150 150 150 

మెయిన్స్ పరీక్ష విధానం:

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు పరీక్ష సమయం (నిమిషాల్లో)
పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం) 150 150 150
పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ & టెక్నాలజీ) 150 150 150
మొత్తం 300 300 300

182 పోస్టులతో త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్..

ఈ ఏడాది జనవరిలోనే గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశించారు. కాని నాలుగు నెలలైన ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. అయితే తాజాగా పరీక్ష విధానం, సిలబస్ వివరాల గురించి స్పష్టత రావడంతో.. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

ఖాళీల వివరాలు ఇలా..

మొత్తం ఖాళీలు: 182

➛ డిప్యూటీ తహసీల్దార్: 30 పోస్టులు

➛ సబ్ – రిజిస్ట్రార్ (గ్రేడ్‌–2): 16 పోస్టులు

➛ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, సహకార: 15 పోస్టులు

➛ మున్సిపల్ కమీషనర్ (గ్రేడ్-III):  05 పోస్టులు

➛ ALO (లేబర్): 10 పోస్టులు

➛ ASO (చట్టం): 02 పోస్టులు

➛ ASO (శాసనసభ): 04 పోస్టులు

➛ ASO (GAD): 50 పోస్టులు

➛ JA (CCS): 05 పోస్టులు

➛ సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీ డిపార్ట్‌మెంట్: 10 పోస్టులు

➛ జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్: 20 పోస్టులు

➛ సీనియర్ ఆడిటర్, రాష్ట్ర ఆడిట్ విభాగం: 05 పోస్టులు

➛ ఆడిటర్, పే & అలవెన్స్‌ల విభాగం: 10 పోస్టులు

Also Read:

తెలంగాణ గురుకులాల్లో 4006 టీజీటీ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన సమగ్ర ప్రకటన ఏప్రిల్ 28న అధికారులు విడుదల చేశారు. దీనిద్వారా 4006 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 728 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 218 పోస్టులు, బీసీ గురుకుల పాఠశాలల్లో 2379 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 594, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 87 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

బీఎస్‌ఎఫ్‌లో 247 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- వివరాలు ఇలా!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Embed widget