అన్వేషించండి

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

Group1 Notification in AP: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది.

APPSC Group1 Notification 2023: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల నుంచి జనవరి 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు. పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాలు జనవరి 1 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

వివరాలు..

* గ్రూప్-1 నోటిఫికేషన్

ఖాళీల సంఖ్య: 81

➥ డిప్యూటీ కలెక్టర్: 09 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).

➥ అసిస్టెంట్ కమిషనర్: 18 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్.

➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2: 26 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీస్.

➥ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్): 01 పోస్టు 
విభాగం: ఏపీ జైళ్ల శాఖ.

➥ డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్.

➥ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 06 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్.

➥ డిప్యూటీ రిజిస్ట్రార్: 05 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీస్.

➥ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 01 పోస్టు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్.

➥ అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 పోస్టు
విభాగం: ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్.

➥ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ/అకౌంట్స్ సర్వీస్.

➥ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్.

➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్), మెయిన్స్ పరీక్షల ఆధారంగా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

మెయిన్స్ పరీక్ష విధానం..

మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.01.2024. (11:59 PM)

* స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్) తేది: 17.03.2024. (11:59 PM)

Notification

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

ALSO READ:

ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget