News
News
X

APPSC: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మెయిన్ పరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు.  

FOLLOW US: 
Share:

ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17న ప్రధాన పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఫిబ్రవరి 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు.  

ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు తెలపవచ్చని కమిషన్ సూచించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తారు. పోస్ట్, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఫోన్, వ్యక్తిగత సమర్పణ.. ఇలా మరే ఇతర మార్గాల్లో నమోదుచేసే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా వచ్చే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రాథమిక 'కీ' ఇలా..

➥ రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..

ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మెయిన్ పరీక్షకు సంబంధించి 1278 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. వీరిలో 1248 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 1179 ((94.47%) మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు హాజరయ్యారు. నాలుగు జిల్లాల్లోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షను కమిషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక కీని ఫిబ్రవరి 22న విడుదల చేయనుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించి, ఫైనల్ కీతోపాటు ఫలితాలను ఏపీపీఎస్సీ వెల్లడించనుంది.

ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్‌లో  60 ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 డిసెంబరు  28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి  30.12.2021 నుంచి 19.01.2022 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పోస్టుల భర్తీకి గతేడాది(2022) జులై 24న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాతపరీక్ష ప్రాథమిక కీని జులై 26న విడుదల చేసిన ఏపీపీఎస్సీ ఫైనల్ కీని అక్టోబరు 27న విడుదల చేసింది. అక్టోబరు 27న స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న మెయిన్ పరీక్ష నిర్వహించింది. 

Also Read:

అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల ఫలితాలు, ఫైనల్ కీ విడుదల - డైరెక్ట్ లింక్స్ ఇవే!
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. పలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 9 అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులకు గాను 1:3 నిష్పత్తిలో మొత్తం 27 మంది అభ్యర్థులను వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్టులకు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

DAO HallTickets: డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 23 Feb 2023 12:24 AM (IST) Tags: APPSC Executive Officer Main Exam Executive Officer Initial key Executive Officer Response sheets

సంబంధిత కథనాలు

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

UPSC Recruitment: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

SVNIT Jobs: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు

CUK Jobs: సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50  ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్  పోస్టులు

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్