APPSC Key Objections: అభ్యర్థులకు అలర్ట్, ఆన్సర్ 'కీ' అభ్యంతరాలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం! ఇకపై ఫీజు చెల్లించాల్సిందే!
అభ్యర్థులు లేవనెత్తే ఒక్కో అభ్యంతరానికి రూ.100 ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లన్నింటికీ ఈ నిబంధన అమలవుతుందని కమిషన్ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు కీలక సూచన చేసింది. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఇకపై రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు లేవనెత్తే ఒక్కో అభ్యంతరానికి రూ.100 ఫీజుగా చెల్లించాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లన్నింటికీ ఈ నిబంధన అమలవుతుందని కమిషన్ స్పష్టం చేసింది.
కమిషన్ నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్‌లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను దాఖలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాటి సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే వీటిని పరిశీలించి అన్నింటికీ సరైన సమాధానం ఇచ్చేందుకు సమయం పడుతోంది. ఇలా చేయడం వల్ల అభ్యర్థులకు వివరాలు వెల్లడించడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, తప్పుడు అభ్యంతరాలకు చెక్ పెట్టేందుకు ఒక్కో అభ్యంతర అప్లికేషన్ కు రూ.100 కట్టాలనే కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్ నిర్ణయించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అభ్యంతరాల తుది పరిశీలనలో నిజమైన వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమిషన్ చెల్లిస్తుందని కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు: 08/2021 & 16/2022, 09/2021& 17/2022, 10/2021 & 18/2022, 14/2021 & 14/2022, 15/2021 & 15/2022, 23/2021, 24/2021, 6/2022, 11/2022, 12/2022, 19/2022, 20/2022, 21/2022, 25/2022, 28/2022
Also Read:
AP Highcourt: హైకోర్టు ఉద్యోగాల పరీక్ష తేదీ వెల్లడి, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?
ఏపీ హైకోర్టులో 241 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీని హైకోర్టు అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 20న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 14 నుంచి హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జనవరి 23న లేదా అంతకుముందు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఫిబ్రవరి 13న లేదా అంతకుముందు ప్రకటించే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఓసీఎల్‌లో 1746 అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రిఫైనరీస్ డివిజన్.. పలు ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఐవోసీఎల్ రిఫైనరీల్లో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 1746 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 03లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..