APPSC EO Main Exam: 'ఈవో' పోస్టుల పరీక్ష షెడ్యూలు వెల్లడి, 1278 అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్!
ఫిబ్రవరి 17న మెయిన్ పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న మెయిన్ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ డిసెంబరు 30న విడుదల చేసింది. దీనిప్రకారం ఫిబ్రవరి 17న మెయిన్ పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (హిందూ ఫిలాసఫీ & టెంపుల్ సిస్టమ్) పరీక్ష నిర్వహిస్తారు. డిగ్రీ స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కోసం విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలోని దేవాదాయశాఖలో 60 ఈవో పోస్టుల భర్తీకి జులై 24న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 52,915 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని జులై 26న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, వచ్చిన అభ్యంతరాలపై విషయనిపుణులతో పరిశీలన జరిపి అక్టోబరు 27న ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల్లో మొత్తం 1278 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఈ 1278 మంది అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
Also Read:
వెబ్‌సైట్‌లో 'గ్రూప్-1' ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాలు!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి. జనవరి 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధాకారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబంధించిన హాలటికెట్లను డిసెంబరు 31 నుంచి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం ప్రశ్నప్రతం బుక్‌లెట్, ఓఎంఆర్ పత్రాల నమూనా పత్రాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పరీక్షపై అవగాహన కోసం ఈ నమూనా పత్రాలు ఉపయోగపడుతాయి. వాటిల్లో అభ్యర్థులు పరీక్షలో అనుసరించాల్సిన నిబంధనలను, ఇతర జాగ్రత్తలను క్షుణ్నంగా ఇచ్చారు. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ నమూనా పత్రాల కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు - చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు, 6100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం దరఖాస్తు గడువును జనవరి 7 వరకు పొడిగిస్తూ పోలీసు నియామక మండలి నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచునన్నట్లు ముందుగా ప్రకటించినప్పటికీ.. దరఖాస్తు గడువును జనవరి 7 వరకు పొడిగించడంతో.. పరీక్షలకు 10 రోజుల ముందునుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..