News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

APPSC Group-1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతం, 82.38 శాతం అభ్యర్థులు హాజరు! అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన!

రాతపరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్పాటు చేసింది. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు.ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది.

రాతపరీక్షకు 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. అంటే 82.38 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా నంద్యాల జిల్లా 85.89 % మంది అభ్యర్థులు హాజరుకాగా, అత్యల్పంగా కృష్ణా జిల్లా (73.99%) జిల్లా నుంచి హాజరయ్యారు.

అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన..
ఈసారి పేపర్-1 పరీక్ష తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఇచ్చారని, చదవి అర్థం చేసుకునేందుకే ఎక్కువ సమయం పట్టిందని అభ్యర్థులు తెలిపారు. ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు తక్కువ సమయం మిగిలిందని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రం.. ఉద్యోగార్థుల సత్తా పరీక్షించేందుకే ఎక్కువ నిడివిగల ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. 

మూడువారాల్లోనే ఫలితాలు..?
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నారు. ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు పూర్తిచేసి ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

'గూగుల్' చూస్తూ 'గ్రూప్-1' పరీక్ష..
విజయవాడ బెంజి సర్కిల్‌లోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో కాపీయింగ్ వెలుగు చూసింది. ఉదయం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు పోరంకి సచివాలయంలో పనిచేస్తున్న వెంకటేశ్ అనే అభ్యర్థి పరీక్షకు ఏకంగా మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు. తాపీగా మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసి జవాబులు చూసి రాస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:

APPSC: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 
గ్రూప్-2 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 'గ్రూప్-2' పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పు - ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇక మీదట ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్షను కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటి నుంచి మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండనున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ జనవరి 6న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 09 Jan 2023 06:49 AM (IST) Tags: APPSC Group-1 Prelims Details APPSC Group-1 Prelims Attendance Group-1 Prelims Attendance Details Group-1 Prelims Exam

ఇవి కూడా చూడండి

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

IIT Kanpur Placements 2023: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల జోరు, అంతర్జాతీయ సంస్థల్లో అందిపుచ్చుకుంటున్న అవకాశాలు

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

TSPSC Group 4 Results: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

ISRO Exam: ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

NTA CURE: కేంద్రీయ విద్యాలయాల్లో 150 పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

APPSC Group 2 Exam: ఏపీపీఎస్సీ 'గ్రూప్‌-2' సిలబస్‌లో కీలక మార్పులు, అవేంటంటే?

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×