ఏపీపీఎస్సీ తాజాగా 1,466 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇది ఇప్పటికే జారీ చేసిన 892 ఉద్యోగాలకు అదనం.
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
APPSC Group 2: ఏపీపీఎస్సీ తాజాగా 1466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 686 పోస్టులతో గ్రూప్-2 ఉద్యోగాలు ఉన్నాయి.

- ఏపీపీఎస్సీ 1,466 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
- గ్రూప్-2లో 686 పోస్టులు, నవంబర్ 9న పూర్తి నోటిఫికేషన్ వెల్లడి.
- పరీక్ష రెండు దశల్లో; వయోపరిమితికి జులై 1 కటాఫ్ తేదీగా పరిగణన.
APPSC Group 2: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలండర్ ప్రకారం ఇప్పటికే 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాగా, తాజాగా మరో 1,466 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను కమిషన్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడు సుధీర్తో కలిసి ఇన్ఛార్జ్ ఛైర్మన్ శశిధర్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఖాళీల సంఖ్య, కేటగిరీల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతల వివరాలతో పూర్తిస్థాయి ప్రకటనలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
గ్రూప్-2లో 686 పోస్టులు
తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో గ్రూప్-2 లో 686 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్-2కి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ను నవంబరు 9న విడుదల చేస్తారు. విద్యార్హతలు, పోస్టుల వారీగా కేటాయింపు తదితర వివరాలు పూర్తి నోటిఫికేషన్లో వెల్లడిస్తారు.
గ్రూప్-2 పరీక్షా విధానం
- గ్రూప్-2 సెలెక్షన్ ప్రాసెస్ లో రెండు దశల్లో (స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్) నిర్వహించనున్నారు.
Also Read: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
స్క్రీనింగ్ పరీక్ష
- మొత్తం 150 మార్కులకు (ఆబ్జెక్టివ్ టైప్) పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష
- మెయిన్స్ దశలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.
వయోపరిమితి
- వయోపరిమితికి జులై 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారు.
- నాన్-యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపులు వర్తిస్తాయి.
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, దరఖాస్తుల కోసం APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కమిషన్ కోరింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న తమ ఐడీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: ఈసీఐఎల్లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
Frequently Asked Questions
ఏపీపీఎస్సీ ఇటీవల ఎన్ని కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది?
గ్రూప్-2లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు మరియు పూర్తి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?
గ్రూప్-2లో 686 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ నవంబరు 9న విడుదల చేస్తారు.
గ్రూప్-2 పరీక్షా విధానం ఎలా ఉంటుంది?
గ్రూప్-2 సెలెక్షన్ ప్రాసెస్ రెండు దశల్లో ఉంటుంది: స్క్రీనింగ్ టెస్ట్ (150 మార్కులు) మరియు మెయిన్స్ (రెండు పేపర్లు, మొత్తం 300 మార్కులు).
నాన్-యూనిఫామ్ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి ఎంత?
నాన్-యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు. వయోపరిమితికి జులై 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు






















