(Source: ECI/ABP News/ABP Majha)
APERC: ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, వివరాలు ఇలా
APERC Recruitment: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
APERC Recruitment: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 06 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్ఢ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల షంఖ్య: 06
* ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్ఢ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Commission Secretary,
Andhra Pradesh Electricity Regulatory Commission,
Red Hills, Khairatabad, Hyderabad.
జీతం: నెలకు రూ.20,600 నుంచి రూ.63,660.
దరఖాస్తుకు చివరితేదీ: 24.01.2024.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదితరగతి సర్టిఫికేట్ కాపీ.
➥ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ.
➥ ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్ కాపీ.
➥ రీసెంట్ 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్స్.
➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ ఫ్రెష్ కమ్యునిటీ సర్టిఫికేట్.
ALSO READ:
డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 632 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
NLC India Limited Notification: తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఒక సంవత్సరం అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 632 గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.