అన్వేషించండి

AP TET: ఏపీలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయ్! మొత్తం 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు

AP TET: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET), డీఎస్సీని వేర్వేరుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెట్‌కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

AP DSC Notification 2024: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET), డీఎస్సీని వేర్వేరుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెట్‌కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా టెట్ పరీక్షల షెడ్యూలును అధికారులు ఖరారుచేయనున్నారు. ఒకవేళ దరఖాస్తులు భారీగా వస్తే.. పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే టెట్‌తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్సీలో 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.

జనవరి 31న ఆమోదం..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, టెట్, డీఎస్సీకి జనవరి 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూలును ప్రకటిస్తారు. మొదట టెట్ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

ఎస్జీటీ పోస్టులు డీఈడీ అభ్యర్థులకే..
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(SA) పోస్టులకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 

గతంలో పరీక్షలు ఇలా..
గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.

ALSO READ:

వీసీల నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల(వీసీల) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని 10 యూనివర్సీలకు వీసీలను నియమించనున్నారు. వీటిలో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్‌), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్‌), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్‌), జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్‌)లకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NICL AO Recruitment 2026: NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
NICLలో 321 ఏవో పోస్టుల భర్తీ.. రూ. 1.14 లక్షల జీతం, దరఖాస్తు విధానం ఇలా!
ECIL Recruitment 2026: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Teachers Special TET: తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే
తెలంగాణలో స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల.. అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోరాహోరీగా నామినేషన్లు! చివరిలో నరేశ్, రాంప్రసాద్‌ల అల్లరి హైలెట్!
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Embed widget