అన్వేషించండి

AP Government Jobs: ఏపీలో 1238 ఉద్యోగాల భర్తీ.. ఈ నెలలోనే నోటిఫికేషన్

AP Job Calendar 2021: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో 1238 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో త్వరలో 1238 పోస్టులు (ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్‌ పోస్టులు) భర్తీ కానున్నాయి. నిరుద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10,143 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులను ఏయే నెలల్లో విడుదల చేస్తామనే వివరాలను కూడా వెల్లడించింది. ఈ క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో 1238 పోస్టులు భర్తీ కానున్నాయి. దీని ప్రకారం అతి త్వరలో వీటి భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 
ఆగస్టు నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. వీటితో పాటు విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ తదితర నియామక సంస్థల ద్వారా విడుదల చేయనుంది. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం రాత పరీక్షలో పొందిన మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అర్హులను ఎంపిక చేస్తామని వెల్లడించింది. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించబోమని పేర్కొంది. ఈ ఖాళీలను రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వివరించింది. 


ఏపీపీఎస్సీ సంచలన నిర్ణయం..
ఉద్యోగాల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ద్వారా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రాత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్ - 1 సహా ఇతర ఉద్యోగాలకు సైతం ఇంటర్వ్యూలు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ కానున్న పోస్టుల వివరాలు.. 
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు : 10,143
జూలై 2021 : ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ పోస్టులు - 1,238
ఆగస్టు 2021 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మరియు గ్రూప్‌ 2 - 36
సెప్టెంబర్‌ 2021 : పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు - 450
అక్టోబర్‌ 2021 : వైద్య శాఖలో డాక్టర్లు & అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 451
నవంబర్‌ 2021 : వైద్య శాఖలోని పారామెడికల్‌, ఫార్మసిస్టులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు - 5,251
డిసెంబర్‌ 2021 : వైద్య శాఖలో నర్సులు - 441
జనవరి 2022 : విద్యా శాఖ - డిగ్రీ కాలేజీల లెక్చరర్లు - 240
ఫిబ్రవరి 2022 : విద్యా శాఖ - యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 2,000
మార్చి 2022 : ఇతర శాఖల పోస్టులు - 36  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget