అన్వేషించండి

AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు

Assistant Professor Posts | ఏపీలోని యూనివర్సిటీల్లో 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. పారదర్శక విధానంలో 6 నెలల్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాష్ట్ర యూనివర్సిటీల్లో 1,523 అధ్యాపక ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
  • ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ.
  • అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ అందుబాటులోకి.
  • కొన్ని పోస్టులకు APPSC పరీక్ష, అర్హత ఆధారంగా ఎంపిక ప్రక్రియ.

Faculty Posts At Universities | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండ‌ర్ మేర‌కు రాష్ట్రంలోని మొత్తం యూనివ‌ర్సిటీల్లో 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఉన్న‌త విద్యాశాఖ విడుద‌ల చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ , కేడర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 1,523 పోస్టులలో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ ఖాళీలు (ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కేటాయించిన పోస్టులు) ఉన్నాయి. వీటిని 6 నెలల్లోపు పారదర్శకంగా భర్తీ చేస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీని పెంచ‌డానికి చేపట్టిన దశలవారీ చర్యలలో భాగంగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అర్హత కలిగిన శాశ్వత ప్యాకల్టీ నియామ‌కం వ‌ల్ల‌ నాణ్యమైన టీచింగ్, రీసెర్చ్, విశ్వవిద్యాలయాల గుర్తింపు (NAAC,NIRF ర్యాంకింగ్స్) మెరుగుపడటానికి వీలవుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చ‌దువుతున్న‌ విద్యార్థుల‌కు ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీ ఒక వ‌రంలాంటిదని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. 

మొత్తం 1,523 పోస్టుల కేడర్ వారీ వివరాలు 

కేడర్  రెగ్యులర్ బ్యాక్‌లాగ్ మొత్తం 
ప్రొఫెసర్ (Professor) 63 0 63
అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) 191 143 334
అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) 886 134 1,020
అసిస్టెంట్ లైబ్రేరియన్ (Assistant Librarian) 0 2 2
లెక్చరర్ (RGUKT లో మాత్రమే) 104 0 104
--- --- --- ---
మొత్తం (Grand Total) 1,244 279 1,523

 

ఏపీ యూనివర్శిటీల వారీగా ఫ్యాకల్టీ పోస్టుల వివరాలు

  యూనివర్సిటీ / సంస్థ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ మొత్తం
1 ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU), విశాఖపట్నం 232 14 246
2 శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU), తిరుపతి 110 15 125
3 శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU), అనంతపురం 81 22 103
4 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU), గుంటూరు 81 1 82
5 జేఎన్‌టీయూ అనంతపురం (JNTU-A) 75 20 95
6 డాక్టర్ YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (YSRAFU) 65 0 65
7 జేఎన్‌టీయూ కాకినాడ (JNTU-K) 48 8 56
8 రాయలసీమ విశ్వవిద్యాలయం (RU), కర్నూలు 47 0 47
9 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 42 6 48
10 డాక్టర్ BR అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (BRAU), శ్రీకాకుళం 42 4 46
11 ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం (AKNU), రాజమహేంద్రవరం 39 8 47
12 జేఎన్‌టీయూ గురజాడ, విజయనగరం (JNTU-GV) 38 10 48
13 డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం (DrAHUU), కర్నూలు 37 0 37
14 కృష్ణా విశ్వవిద్యాలయం (KU), మచిలీపట్నం 36 7 43
15 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU), నెల్లూరు 35 13 48
16 ద్రావిడ విశ్వవిద్యాలయం (DU), కుప్పం 15 5 20
17 ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం (AKU) 9 0 9
18 యోగి వేమన విశ్వవిద్యాలయం (YVU), కడప 4 43 47
19 రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (RGUKT) 208 103 311
  మొత్తం 1,244 279

కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్
అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో తొలిసారిగా ఫ్యాకల్టీ నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్  https://apuniversitiesrecruitment.apcfss.in  తీసుకొచ్చారు. అభ్యర్థి ఒక్కసారి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఏ యూనివర్సిటీలోని పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ అప్లికేషన్‌ను సంబంధిత యూనివర్సిటీకి పంపిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ఆధార్-లింక్డ్ OTP వెరిఫికేషన్, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, తరువాత అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతారు. దీనిని నైపుణ్యం పోర్టల్ https://naipunyam.ap.gov.in/job-calendar ) తో పాటు అన్ని యూనివర్సిటీల వెబ్‌సైట్ల ద్వారా సైతం యాక్సెస్ చేయవచ్చు.

అభ్యర్థులకు ముఖ్యమైన తేదీలు
- కామన్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌లో నోటిఫికేషన్‌ తేదీ: మే 15
- ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ ప్రారంభం : మే 18 
- ఆన్‌లైన్‌ అప్లికేషన్, ఫీజు పేమెంట్ చివరి తేదీ: జూన్‌ 8
- హార్డ్‌ కాపీతో అప్లికేషన్ సబ్మిట్ గడువు : జూన్‌ 15
- అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌స్ అభ్యర్థుల ప్రైమరీ అర్హత జాబితా : జూన్‌ 22
- ప్రాథమిక అర్హతపై అభ్యంతరాలకు చివరి తేదీ : జూన్‌ 29
- స్క్రీనింగ్‌ టెస్ట్‌కు తుది అర్హత జాబితా వెల్లడి : జూన్‌ 30

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల‌కు APPSC ద్వారా రాత పరీక్ష
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా రాత  పరీక్ష ఉంటుంది. ఒకవేళ  ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ మంది అర్హత గల అభ్యర్థులు ఉన్న సందర్భంలో పరీక్ష నిర్వహిస్తారు. లేక‌పోతే నేరుగా స్క్రీనింగ్-కమ్-ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలనకు పంపి.. మీ అకడమిక్,  రీసెర్చ్ క్రెడెన్షియల్స్ మూల్యాంకనం, ఇంటర్వ్యూ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తుది ఎంపిక జరుగుతుంది.  స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రక్రియలు SC / ST / BC బ్యాక్‌లాగ్ ఖాళీలతో సహా అభ్యర్థులందరికీ ఒకే విధంగా ఉంటాయి. పారదర్శకంగా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని పోస్టులకు ఎంపిక చేయనున్నారు.  

కాంట్రాక్ట్ లెక్చరర్లకు వెయిటేజీ 
ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను గుర్తిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారి అనుభవానికి వెయిటేజీ మార్కులు ఇస్తారు. అభ్యర్థి రాత పరీక్షలో ప్రతిభతో అర్హత సాధించిన తర్వాత మాత్రమే ఈ వెయిటేజీ పరిగణనలోకి తీసుకుంటారు. 

వివిధ వర్గాలకు రిజర్వేషన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం SC, ST, BC, EWS అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లు,  మహిళలకు (33⅓ శాతం), దివ్యాంగులకు (4 శాతం), మాజీ సైనికోద్యోగులకు (2 శాతం), స్పోర్ట్స్ అభ్యర్థులకు 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తారు.  

 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఎన్ని ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎంత కాలంలో పూర్తి చేస్తారు?

మొత్తం 1,523 పోస్టులను 6 నెలల్లోపు పారదర్శకంగా భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

నాణ్యమైన టీచింగ్, రీసెర్చ్ మెరుగుపడటానికి, విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్ పెరగడానికి ఈ నియామకాలు దోహదపడతాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే APPSC ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తారు, లేదంటే అకడమిక్, రీసెర్చ్ క్రెడెన్షియల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఈ నియామకాల్లో ఏమైనా వెయిటేజీ ఉంటుందా?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రాత పరీక్షలో అర్హత సాధించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల అనుభవానికి వెయిటేజీ మార్కులు ఇస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget