అన్వేషించండి

AP DSC Hall Tickets: ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా.. డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

AP DSC Admit Cards Download | ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

AP DSC Hall Tickets Download | అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీకి సంబంధించి ముఖ్యమైన అప్ డేట్ వచ్చింది. ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025)  హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులకు జూన్‌ 6 నుంచి జూన్ 30 వరకు మెగా డీఎస్సీ నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ ఏపీ డీఎస్సీ అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ కొన్ని రోజుల కిందట ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఏప్రిల్‌ 20 నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టులకు దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిసిందే.

 

జిల్లా పేరు

అభ్యర్థులు

దరఖాస్తులు
1

శ్రీకాకుళం

22,648

39,235
2 విజయనగరం 18,001  31,038
3 విశాఖపట్నం  29,779  49,658
4 తూర్పు గోదావరి  38,617  63,004
5 పశ్చిమ గోదావరి  25,750   42,466
6 కృష్ణా  19,953   35,220
7 గుంటూరు   25,067   43,570
8 ప్రకాశం  21,046   35,095
9 నెల్లూరు   15,993   28,772
10 చిత్తూరు    26,501    45,221
11 కడప    15,812  29,915
12 కర్నూలు    39,997    73,605
13 అనంతపురం    29,078    50,475
14 ఇతర రాష్ట్రాల వారు  7,159     10,143

ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) నోటిఫికేషన్‌కు భారీగా స్పందన లభించింది. మొత్తం 3.35 లక్షల మంది మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల  దరఖాస్తు గడువు ముగియగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులతో కలిపితే మొత్తం పోస్టులకుగానూ 5 లక్షల 77 వేల 417 అప్లికేషన్లు వచ్చినట్లు అయింది. ఇతర రాష్ట్రాల నుంచి 7159 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 39,997 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి అత్యల్పంగా 15వేల 8 వందల 12 మంది అభ్యర్థులు డిఎస్సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరు నుంచి హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యాశాఖ భావించింది.. జూన్ 6న ఏపీ మెగా డీఎస్సీ టీచర్ పోస్టుల పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

మాక్ టెస్టులు పూర్తి.. 

మే 20 నుంచి మెగా డీఎస్సీ అభ్యర్థులకు మాక్‌ టెస్టులు నిర్వహించారు. తాజాగా డీఎస్సీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అనంతరం 7 రోజుల పాటు డీఎస్సీ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల గడువు ముగిసిన వారం రోజులకు ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల కానుంది. డీఎస్సీ ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు మెరిట్ జాబితా రూపంలో విడుదల చేస్తారు. అనంతరం మెరిట్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేసన్ ప్రక్రియ చేపడతారు. అనంతరం రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఆయా పోస్టులకుగానూ తుది ఎంపిక పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల వివరాలు ప్రకటించనున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget