అన్వేషించండి

AP DSC: ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు ఎన్నికల తర్వాతే? వాయిదావేయాలని ఈసీకి అభ్యర్థుల విజ్ఞప్తులు!

Andhra Pradesh లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉంది. ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. డీఎస్సీ పరీక్షలను ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయి.

AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా లోక్‌స‌భ‌ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. డీఎస్సీ పరీక్షలను ఎన్నికల తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయి. డీఎస్సీ వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయని, డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నామని, ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. 

ఏపీలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును కూడా విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. అయితే చాలా మంది అభ్యర్థులు డీఎస్సీ ప‌రీక్షలు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను అభ్యర్థించారు. అయితే ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇది తమ ప‌రిధిలో ఉండ‌ద‌ని.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమతిస్తే వాయిదా వేస్తామ‌ని అభ్యర్థులకు తెలిపింది. అయితే.. ఏపీ విద్యాశాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతలేదు.

మార్చి 25 నుంచి హాల్‌టికెట్లు..
డీఎస్సీ పరీక్ష కోసం అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోవడం కోసం మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా మార్చి 25 నుంచి హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచనునున్నట్లు మంత్రి తెలిపారు. మారిన షెడ్యూలుతో అభ్యర్థులకు పరీక్షలకు ప్రిపేర్ అవకాడానికి మరింత సమయం లభించిందని, అభ్యర్ధులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ  విజ్ఞప్తి చేశారు.

మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు..
కొత్త షెడ్యూలు ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్(SGT) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(PGT), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. అభ్యర్థులు మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో షెడ్యూలును ప్రభుత్వం మార్చింది.

ఏపీ డీఎస్సీ కొత్త షెడ్యూలు..

విషయం ముఖ్యమైన తేదీలు
పరీక్ష కేంద్రాల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు 20.03.2024 నుంచి.
డీఎస్సీ-2024 పరీక్ష హాల్‌టికెట్ల విడుదల 25.03.2024 నుంచి.
SGT పోస్టులకు పరీక్షలు 30.03.2024 నుంచి 03.04.2024 వరకు.
GT, PGT, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 07.04.2024.
స్కూల్ అసిస్టెంట్(SA), టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు 13.04.2024 నుంచి 30.04.2024 వరకు.

సబ్జెక్టులవారీగా పరీక్ష తేదీల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?అల్లు అర్జున్ అరెస్ట్, FIR కాపీలో ఏముంది?అల్లు అర్జున్‌ కేసు FIRలో అసలేముంది?నువ్వు అన్న ఏంట్రా.. ముసలోడివి! తాగి మనోజ్ రచ్చ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Allu Arjun Arrest Time: భార్యకు ముద్దిచ్చి - నాన్నకు  ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
భార్యకు ముద్దిచ్చి - నాన్నకు ధైర్యం చెప్పి.. అరెస్టు వేళ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఎమోషనల్‌ సీన్స్!
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా! పుష్పరాజ్‌పై పెట్టిన సెక్షన్లు ఏంటి?
CM Chandrababu: వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
వెల్దీ హెల్దీ హ్యాపీ ఏపీయే లక్ష్యం - 'స్వర్ణాంధ్ర @ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Miss You Movie Review - మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
One Nation One Election: జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
జ‌మిలి ఎన్నిక‌ల‌కు కేంద్ర కేబినెట్ ఓకే.. పార్ల‌మెంటులోనే అస‌లు ఫైట్‌- ఏం జ‌రుగుతుంది?
Look Back 2024: ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
ఈ ఏడాది UPIలో వచ్చిన కీలక మార్పులు, ఆశ్చర్యపరిచే ఫీచర్‌లు ఇవీ
Embed widget