అన్వేషించండి

GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!

GDS Results 2023: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల 5వ జాబితాను అధికారులు విడుదల చేశారు.

Postal GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల 5వ జాబితాను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాలకు సంబంధించి మొదటి జాబితాలో ఏపీ నుంచి 113 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 381 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. 

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో 1,058 పోస్టులు ఉండగా, తెలంగాణ పరిధిలో 961 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తొలి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 18లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. 

ఏపీ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్ షెడ్యూల్-2, జులై 2023) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం ఇస్తారు. 

ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

తెలంగాణ జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(TSGENCO)లో ఏఈ (Assistant Engineer), కెమిస్ట్‌ (Chemist) ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌టికెట్లను విద్యుత్ సంస్థ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌/ మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 17న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని కేంద్రాల్లో ఓఎంఆర్‌ షీట్‌/ ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నియామక పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
Chandrababu Singapore Tour: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
Eng vs Ind 4th Test Day 4 Latest Updates: టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్..  డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్.. డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
PM Modi Visits Tamil Nadu: తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Advertisement

వీడియోలు

PM Modi Counter Maldives President Muizzu | బీచ్ ఒడ్డున సింగిల్ ఛైర్ వేసుకున్న ఎఫెక్ట్ | ABP Desam
PM Modi Sips Indian Tea with UK Prime Minister | యూకే పర్యటనలో ఆ దేశ ప్రధానికి టీ రుచి చూపించిన మోదీ | ABP Desam
Joe root vs Virat Kohli Test Runs | సచిన్ రికార్డు కొట్టేది కొహ్లీనే అనుకున్నాం..కానీ | ABP Desam
Joe Root Breaks run Record with 150 | మోడ్రన్ డే టెస్టు మాంత్రికుడిగా ఎదిగిన జో రూట్ | ABP Desam
Eng vs Ind Fourth Test Day 3 Highlights | భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్న ఇంగ్లండ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
Chandrababu Singapore Tour: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
Eng vs Ind 4th Test Day 4 Latest Updates: టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్..  డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్.. డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
PM Modi Visits Tamil Nadu: తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Telangana Rains Update: హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్, ఆ జిల్లాల్లో ఆదివారం సైతం కుండపోత
హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్, ఆ జిల్లాల్లో ఆదివారం సైతం కుండపోత
Kingdom Trailer: యుద్ధం ఇప్పుడే మొదలైంది - విజయ్ దేవరకొండ మాస్ 'కింగ్‌డమ్' ట్రైలర్ వచ్చేసింది
యుద్ధం ఇప్పుడే మొదలైంది - విజయ్ దేవరకొండ మాస్ 'కింగ్‌డమ్' ట్రైలర్ వచ్చేసింది
CID searches at Bharti Cements: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం - భారతి సిమెంట్స్‌లో సీఐడీ సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం - భారతి సిమెంట్స్‌లో సీఐడీ సోదాలు
Hari Hara Veera Mallu: ముస్లింలు సైతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు, మీకెందుకంత ఆక్రోశం?- షేక్ రియాజ్
ముస్లింలు సైతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు, మీకెందుకంత ఆక్రోశం?- షేక్ రియాజ్
Embed widget