Sea Cadet Corps: సీ క్యాడెట్ కార్ప్స్ లో ప్రవేశాలు, ఇలా అప్లై చేసుకోండి!
Sea Cadet Corps: విశాఖపట్నం యూనిట్, పది నుంచి పన్నెండు ఏళ్ల మధ్య ఉండి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే విద్యార్థులను సీ కాడెట్ కార్ప్స్ ప్రవేశాల కోసం ఆహ్వానించారు. అర్హత గలవాళ్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sea Cadet Corps: విశాఖపట్నం యూనిట్, 10 నుండి 12 సంవత్సరాల మధ్య (01 ఆగస్ట్ 2010 నుండి జులై 31 2010 మధ్య జన్మించినవారు) ఉండి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగల పాఠశాల పిల్లలను (బాలురు మరియు బాలికలు) సీ కాడెట్ కార్ప్స్ ఆహ్వానించారు. దరఖాస్తు ఫారమ్‌లు 31 జూలై 2022 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు INS సర్కార్స్, కమాండ్ స్విమ్మింగ్ పూల్ వద్ద అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫారమ్ లను సేకరించేటప్పుడు అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్, పుట్టిన తేదీ మరియు ఆధార్ కార్డ్ ను సమర్పించాలి. సరిగ్గా పూరించిన దరఖాస్తు ఫారమ్ లను అదే వేదిక వద్ద, 07 ఆగస్టు 22 ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు సమర్పించాలి.
రాత పరీక్ష ఎప్పుడంటే?
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ మరియు మౌఖిక పరీక్ష 21 ఆగస్టు ఆదివారం నాడు తగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి నిర్వహించనున్నారు. ఎంపిక కోసం స్వచ్ఛందంగా పిల్లలు అందరూ తమ స్కూల్ యూనిఫారంలో రావాలి. సూచించిన ప్రదేశంలో తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల కోసం కాల్ లెటర్ లు 26 ఆగస్టు 22న లేదా అంతకు ముందు వారి కరస్పాండెన్స్ చిరునామాకు పంపబడతాయి. 2022 బ్యాచ్ కి సంబంధించిన శిక్షణ బ్యాచ్ సెప్టెంబర్ 4వ ప్రారంభం అవుతుంది.
సీ క్యాడెట్ కార్ప్స్ అంటే ఏమిటి?
సీ క్యాడెట్ కార్ప్స్ అనేది 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పాఠశాలకు వెళ్లే యువ బాలబాలికలకు శిక్షణ ఇచ్చే స్వచ్ఛంద సంస్థ. స్క్వాడ్ డ్రిల్, రైఫిల్ డ్రిల్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, బోట్ పుల్లింగ్, బ్యాండ్, సెమా ఫోర్, రిగ్గింగ్, సీమాన్ షిప్ , మొదలైన వాటిలో శిక్షణ ఇస్తారు.
దీని వల్ల ఉపయోగం ఏమిటి?
ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విద్యార్థులకు స్వీయ-క్రమ శిక్షణను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. జీవితంలో వారి సంబంధిత లక్ష్యాలను సాధించడంలో వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, వారికి రక్షణ దళాల గురించి మరింత సమాచారం అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. తరువాత జీవితంలో అదే వృత్తిగా తీసుకోవడానికి శిక్షణ ప్రత్యేకంగా సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ అందించే శిక్షణ జీవితంలోనూ ఎంతో సాయపడుతుందని అంటున్నారు సీ క్యాడెట్ కార్ప్స్ ఉన్నత అధికారులు.