అన్వేషించండి

AP Jobs: ఏపీ యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు 46 వేల దరఖాస్తులు, ఒక్కో పోస్టుకు 14 మంది పోటీ

AP Universities Jobs: రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 ఉద్యోగాలకుగాను అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు మొత్తం 46,150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

AP Universities Job Applcations: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 ఉద్యోగాలకుగాను అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor), ప్రొఫెసర్ (Professor) పోస్టులకు మొత్తం 46,150 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరిరోజైన నవంబరు 20న ఎక్కువమంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ ఒక్కరోజే 7 వేల దరఖాస్తులు అందాయి. ఈ సమస్యపై ఉన్నత విద్యామండలికి కొందరు ఫిర్యాదు చేశారు. కానీ గడువు పొడిగింపునకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదు. 

దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన అభ్యర్థులు నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను  నవంబరు 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, డిసెంబరు 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

రోస్టర్‌పై కోర్టుకు..
యూనివర్సిటీల్లో టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ రోస్టర్‌పై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రొవిజనల్ జాబితా జారీ ప్రక్రియను డిసెంబరు 4 దాకా చేపట్టవద్దని వర్సిటీలను న్యాయస్థానం ఆదేశించింది. రిజర్వేషన్ రోస్టర్‌పై వర్సిటీలు కౌంటర్ దాఖలు చేయనున్నాయి. ఆ తర్వాత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నాయి. 

బ్యాక్‌లాగ్ పోస్టులకు పరీక్షపై గందరగోళం..
ఏపీ వర్సిటీల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొనడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎలాంటి పరీక్షలూ పెట్టకూడదంటున్నారు. ఈ పోస్టుల కోసం ఒక్కో దరఖాస్తుకు అదనంగా రూ.2 వేల రుసుం చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటికీ ఒకే ఫీజు అని ప్రభుత్వం చెప్పగా... బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తులు చేస్తే అదనంగా చెల్లించాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు చెప్పారు.

పరీక్ష విధానం..
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 - రూ.1,82,400, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 - రూ.2,17,100, ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 - రూ.2,18,200 చెల్లిస్తారు.

ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. 

టాప్ హెడ్ లైన్స్

Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget