World Water Day 2024 : మీరు తాగుతున్న నీరు శుభ్రంగా ఉందా? లేదా? ఈ పద్ధతులతో నీటి నాణ్యతను పరీక్షించండి
World Water Day 2024 : నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. మంచి నీళ్లు తాగడం మరింత అవసరం. మరి మనం రోజూ తాగే నీరు మంచిదో చెడ్డదో తెలుసుకోవడం ఎలా?
![World Water Day 2024 : మీరు తాగుతున్న నీరు శుభ్రంగా ఉందా? లేదా? ఈ పద్ధతులతో నీటి నాణ్యతను పరీక్షించండి World Water Day 2024 how can we find out if we drink good drinking or not here the full details World Water Day 2024 : మీరు తాగుతున్న నీరు శుభ్రంగా ఉందా? లేదా? ఈ పద్ధతులతో నీటి నాణ్యతను పరీక్షించండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/c8364a3c2b04593ec85028b019c8d3d81711014772550955_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Water Day 2024: మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. భూమి 70 శాతం నీటితో కప్పి ఉంది, అందులో 3 శాతం మాత్రమే తాగడానికి యోగ్యమైన నీరు. భారతదేశంలో తాగునీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆ స్థాయిలో నీరు లభించకపోవడంతో నీటి సంక్షోభం పెరుగుతోంది. 1.4 బిలియన్లకు పైగా జనాభా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని మంచినీటి వనరులలో భారతదేశంలో కేవలం 4 శాతం మాత్రమే ఉంది. దీంతో భారతదేశంలోని చాలా రాష్ట్రాలు నీటి సమస్యతో సతమతమవుతున్నాయి. కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది.
కలుషిత నీరు రోగాలను కారణమవుతుంది
వేగంగా విస్తరిస్తున్న ఫ్యాక్టరీలు, జనాభా ..పరిమిత నీటి వనరులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. నీరు వృథా కావడం, నీటి కాలుష్యం వల్ల ప్రజలు తెలిసి, తెలియక నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీనితోపాటు కలుషిత నీరు కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా, మీరు కొన్ని సాధారణ పద్ధతులను ఉపయోగించి మీరు త్రాగే నీటి స్వచ్ఛతను పరీక్ష చేయవచ్చు. అంటే త్రాగే నీటి నాణ్యతను ఇంట్లోనే సులభంగా చెక్ చేయవచ్చు.
నీటి నాణ్యతను ఇలా చెక్ చేయండి
నీటి రంగు
ఒక గ్లాసులో నీటిని తీసుకొని దాని రంగును గమనించండి. నీటి రంగు పసుపు లేదా గోధుమ రంగులో ఉంటే లేదా దానిలో ఏదైనా రకమైన కణాలు కనిపిస్తే, అప్పుడు నీరు నాణ్యత లేనిదని అర్థం చేసుకోండి.
నీటి వాసన
నీటిలో ఏదైనా రకమైన వాసన ఉంటే, అప్పుడు నీరు కూడా అపరిశుభ్రంగా ఉండవచ్చు. తాగేటప్పుడు ఒక రకమైన దుర్వాసన ఉంటే, అలాంటి నీటిని తాగకండి. అది స్వచ్ఛమైన నీరు కాదు. అలాంటి నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారు.
నీటి రుచి
తాగునీటి రుచి కూడా దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అయితే నీరు చేదుగా అనిపిస్తే మాత్రం తాగకండి. నీరు లోహపు రుచిని కలిగి ఉంటే, అది కాల్షియం, మెగ్నీషియం వంటి కరిగిన లోహ మలినాలను కలిగి ఉండవచ్చు. నీరు బ్లీచ్ లాగా ఉంటే, దానికి క్లోరిన్ కలపడం వల్ల కావచ్చు. నీరు ఉప్పగా అనిపిస్తే, సల్ఫేట్ ఉండవచ్చు.
నీటి స్పష్టత
నీటి రంగుతో పాటు, నీరు కనిపించే విధానం కూడా నీటి నాణ్యత కూడా తెలియజేస్తుంది. నీరు రంగు మారితే లేదా దానిలో కొన్ని రకాల కణాలు ఉంటే, నీరు క్లియర్‌గా ఉండదు. నీటిలో మట్టి రేణువులు ఉన్నా ఇలానే కనిపిస్తుంది. అలాంటి నీరు తాగడానికి పనికి రాదు
నీటి కంటైనర్
మీరు నీటిని నిల్వ చేసే లేదా తాగే కంటైనర్‌ను కూడా చెక్ చేయండి. నీటిలో ఉండే మలినాలు కారణంగా కొన్నిసార్లు పాత్ర రంగు మారుతుంది. కుళాయి లేదా పైపు వంటివి కూడా దాని రంగును మార్చగలదు. అలాంటి నీటిని ఫిల్టర్ చేయకుండా ఎప్పుడూ తాగకండి. ఎలాంటి నీరు తాగినా కాచి వడపోసిన వాటర్ తాగితే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Also Read: ప్రపంచ నీటి దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)