IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Wallet in Back Pocket: బ్యాక్ పాకెట్‌లో పర్సు పెట్టుకుని కూర్చుంటున్నారా? భవిష్యత్తు నరకమే!

వెనుక జేబులో పర్సు పెట్టుకుని కూర్చుంటున్నారా? అయితే, జాగ్రత్త.. ఇప్పటికైనా ఆ అలవాటు మానుకోండి. లేకపోతే మీ భవిష్యత్తు నరకమే.

FOLLOW US: 

Purse In Back Pocket | మీకు వెనుక జేబులో పర్సు పెట్టడం అలవాటా? అయితే, ఇకనైనా ఆ అలవాటును మానుకోండి. ఎందుకంటే, ఆ అలవాటు మీకు భవిష్యత్తులో నరకం చూపించవచ్చు. లావుపాటి పర్సులను బ్యాక్ పాకెట్లలోకి తోసేసే వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పర్సులను జేబులో పెట్టుకొని గంటల సేపు కూర్చొనేవారు, డ్రైవింగ్ చేసేవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువ. ఈ అలవాటు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. 

మీకు నడుపు నొప్పి లేదా తొడలు జివ్వుమని లాగుతుంటే నిర్లక్ష్యం చేయకండి. అది మీరు వెనుక జేబులో పెట్టుకొనే పర్సు లేదా వాలెట్ వల్ల కావచ్చు. బ్యాక్ పాకెట్‌లో పర్సు పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చొనేవారికి తుంటి సమస్యలు ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అంతేగాక, పిరుదల షేపు కూడా మారుతున్నట్లు పేర్కొన్నారు. వెన్నెముక వద్ద ఉండే సయాటిక్ నరాలు నలిగిపోయి నడుము నొప్పి ఏర్పడుతుంది. 

వాలెట్‌ను వెనుక వైపు పెట్టుకుని కూర్చోవడం వల్ల పెల్విస్(Pelvis - వెన్నెముక చివరి భాగం) మీద ఒత్తిడి పడుతుంది. మీరు ఒక వేళ కుడివైపు వెనుక జేబులో పర్సు పెట్టుకున్నట్లయితే పెల్విస్‌లోని కుడి వైపు ఎముక మీద ఒత్తిడి పడి ఎడమ వైపుకు వాలుతుంది. దాని వల్ల వెన్నెముక సమతుల్యత దెబ్బతింటుంది. వెన్నెపూసలు గతి తప్పి వంపు తిరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల నడుము నొప్పి ఏర్పడుతుంది. కొందరిలో వెన్నెముకలో చీలిక ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

వాలెట్ వల్ల కుడి వైపు కండరాల సామర్థ్యం కూడా బాగా తగ్గిపోతుంది. ఫలితంగా సాక్రోలియక్ జాయింట్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఎడమ వైపు ఉండే కండరాలు సైతం మరింత పొడవుగా, అసమర్థంగా మారతాయి. ఫలితంగా అక్కడ విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. కుడి వైపు వెన్నెముక స్టెబిలైజర్లు ఎక్కువగా సాగుతాయి. ఫలితంగా కూర్చొనే భంగిమ కూడా మారుతుంది.  

ఈ సమస్యను ‘హిప్ పాకెట్ సిండ్రోమ్’ అని అంటారు. పర్సు వాడిన కొన్ని రోజుల వరకు ఈ సమస్య పెద్దగా అనిపించదు. కానీ, భవిష్యత్తులో క్రమేనా లక్షణాలు బయటపడతాయి. అప్పటికే మీ వెన్నులో మార్పులు జరిగిపోతాయి. వాలెట్ మీ పిరుదులలోని పిరిఫార్మిస్ కండరాలపై ఒత్తిడి పెట్టడం వల్ల తుంటి (తొడ వెనుక భాగం) నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్ను, కాలు నొప్పి పెడుతుంది. కొందరికి జలదరిస్తున్నట్లు లేదా తిమ్మిరిలుగా ఉంటుంది. ఈ నొప్పి వల్ల కూర్చోడానికి, నడవడానికి కూడా ఇబ్బందిపడతారు. పర్సు మాత్రమే కాదు, గట్టిగా ఉండే ఏ వస్తువులను బ్యాక్ పాకెట్‌లో పెట్టుకొని కూర్చోరాదు. చివరికి చిన్న దువ్వెన ఉన్నా అది మీ పిరుదులు, తుంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

Also Read: వైద్య చిహ్నంలో పాములు దేన్ని సూచిస్తాయి? ‘అపోలో’ కొడుకును ఎందుకు చంపారు?

ఏం చేస్తే మంచిది: 
⦿ బ్యాక్ పాకెట్‌లో పర్సు పెట్టుకుంటే పిరుదులు మంచి షేప్ కనిపిస్తాయనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. అలా కనిపించాలంటే, కార్డులు ఉండే దళసరి పర్సులు లేదా వాలెట్ కాకుండా, పలుచగా ఉండే వాలెట్‌లు పెట్టుకోండి. కానీ, వాటితో ఎక్కువ సేపు కూర్చోవద్దు. 
⦿ ఆఫీసులో కూర్చొనేప్పుడు వాలెట్‌ను డెస్క్ లేదా మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. 
⦿ కారు లేదా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్ పాకెట్‌లో వాలెట్ పెట్టుకోవద్దు. 
⦿ పర్సును ముందు జేబులో పెట్టుకోవడం బెటర్. కానీ, ఎక్కువ సేపు అక్కడ ఉంచకూడదు. 
⦿ అవసరంలేని కాగితాలు. కార్డుల వల్ల కూడా వాలెట్ల్ హార్డ్(గట్టి)గా మారతాయి. వీలైతే వాటిని తొలగించండి.
⦿ మీరు కొనే వాలెట్ ఎప్పుడు మెత్తగానే ఉండాలి. 
⦿ వాలెట్‌లో కేవలం నగదు మాత్రమే ఉండాలి. కార్డులు, కాయిన్స్, ఐడీలు ఉండకూడదు. 
⦿ మహిళల తరహాలోనే పురుషులు కూడా ‘మ్యాన్ బ్యాగ్’ను ఉపయోగించడం మంచిది.

Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు

Published at : 16 Mar 2022 04:45 PM (IST) Tags: Wallet in Back Pocket Purse In Back Pocket Wallet Side Effects Wallet In Pocket Side Effects

సంబంధిత కథనాలు

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!

Sweat in Sleep: నిద్రలో చెమట పట్టడం ఆ వ్యాధులకు సంకేతం? డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!

టాప్ స్టోరీస్

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!