అన్వేషించండి

పాదాలకు పగుళ్లు ఎందుకు వస్తాయి? వాటిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవిగో

చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్న సమస్యల్లో పగిలిన పాదాలు కూడా ఒకటి.

పాదాల అడుగున వెనుక భాగంలో చర్మం గరుకుగా మారి తర్వాత పగుళ్లుగా ఏర్పడుతుంది. ఇది చూడడానికి అందవికారంగా కనిపించడమే కాదు కొన్నిసార్లు మంట, నొప్పితో బాధిస్తుంది కూడా. ఆ పగుళ్ళ బారిన పడే వారిలో మగవారితో పోలిస్తే ఆడవారే ఎక్కువ. ఇంటి పనుల్లో పడి పాదాలను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఆ పగుళ్లు తీవ్రంగా మారి మరింతగా బాధిస్తాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక ఎంతో మంది మహిళలు అలా వదిలేస్తారు. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో పగుళ్లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే వచ్చిన పగుళ్లను మళ్లీ మృదువుగా మార్చుకోవచ్చు.

ఎందుకు వస్తాయి?
ముందుగా పాదాలకు పగుళ్లు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలి? మన మొత్తం శరీరం నిల్చోవడానికి, నడవడానికి సహకరించేవి పాదాలే. అంటే మన శరీర భారాన్ని మొత్తం అవే మోస్తాయి. దీనివల్ల అవి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అందుకే మన శరీర నిర్మాణంలో పాదాల కింద చర్మం చాలా మందంగా ఉంటుంది. దృఢమైన కండరపొరతో విస్తరించి ఉంటుంది. శరీర రక్తప్రసరణ వ్యవస్థలో అడుగున ఉండేవి పాదాలే. అందుకే అక్కడి వరకు రక్తం చేరడం ఒక్కోసారి తగ్గిపోతుంది. నీటిని, పోషక విలువలని తీసుకెళ్లేవి రక్తనాళాలే. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలు, ఆక్సిజన్, నీరు వంటివి  చేరుతాయి. కానీ పాదాల అడుగు భాగానికి మాత్రం సరిగా చేరక అక్కడ ఎండిపోతుంది, దీనివల్ల చర్మం పగుళ్లు ఏర్పడుతుంది. ఒక్కసారి నీరు లేని పంట పొలాలను గుర్తు తెచ్చుకోండి. బీరు వారినట్లు అవుతాయి. పాదాల అడుగుభాగం కూడా అంతే. ఇలా జరగకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

ఏం చేయాలి?
1.  పాదాల పగుళ్ళతో బాధపడుతున్న వారు రోజూ నిద్రపోయే ముందు కొబ్బరి నూనె పాదాల పగుళ్ల భాగంలో బాగా పట్టించాలి. బాగా మర్ధనా చేయాలి. 
2. రోజులో పావుగంటసేపు  పాదాలను చల్లని నీరు నింపిన బకెట్లో ముంచి ఉంచాలి. తరువాత పగుళ్ల భాగంలో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు పోతాయి. 
3. పైనాపిల్ పండును మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. ఆ గుజ్జును పాదాల పగుళ్ళపై రాసి 45 నిమిషాల పాటు వదిలేయాలి. పైనాపిల్ లో ఉండే ఆమ్ల గుణాలు పగుళ్లలో పేరుకుపోయిన మృత కణాలను తొలగిపోయేలా చేస్తాయి. పగుళ్లు కూడా తగ్గుతాయి. చర్మం గరుకుగా కాకుండా మృదువుగా మారతాయి.
4.  పాదాలకు రోజు మర్దన చేసుకుంటే రక్తప్రసరణ సవ్యంగా అవుతుంది. దీనివల్ల అక్కడ చర్మం పోషకాహారంతో నిండి పగుళ్లు రాకుండా ఉంటుంది. రోజులో కనీసం పావుగంటసేపు మర్దన చేసుకోవడం అవసరం. 

Also read: ఆపిల్ పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం, కానీ ఆ సమయంలో మాత్రం తినకూడదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
30 Minute Daily Walk : ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ప్రతిరోజూ 30 నిమిషాల నడకతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ నడిచేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Monsoon Diet for Kids : వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి
వర్షాకాలంలో పిల్లల ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కిడ్స్ డైట్‌లో చేర్చండి

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Embed widget