News
News
వీడియోలు ఆటలు
X

Worms Under Skin: షాకింగ్ - మహిళ మెదడు, చర్మం పొరల్లో పురుగులు - ఇలాంటివి తింటే మీకు ఆ సమస్య రావచ్చు!

బయట తినే ఆహారం శుభ్రంగా ఉండదేమో అనుకుని తనకి నచ్చిన ఫుడ్ ఇంట్లోనే చేసుకుని తిన్నది ఒక మహిళ. చివరకి అది ఆమెని చావు అంచుల వరకు తీసుకెళ్లింది.

FOLLOW US: 
Share:

రొటీన్ ఫుడ్ ఏం తింటాం, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? తింటే తినండి.. కానీ, వియత్నాంలో ఓ మహిళ తరహాలో మాత్రం ట్రై చేయకండి. కాదు, కూడదని ట్రై చేశారో తిప్పలు తప్పవు. చివరికి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. లక్కీగా ఆ మహిళకు తలనొప్పి రావడం మంచిదైంది. తలనొప్పి ఎంతకీ తగ్గడంలేదని ఆమెను డాక్టర్లను కలిస్తే.. షాకింగ్ విషయం తెలిసింది. ఆమె మెదడులో కదులుతున్న పురుగులను చూసి డాక్టర్లు అవక్కయ్యారు. అంతేకాదు.. ఆమె చర్మం పొరల్లో మెలికలు తిరుగుతున్న పురుగులను చూసి.. ఆమె ఫుడ్ హిస్టరీని అడిగి తెలుసుకున్నారు. కారణం తెలియడం వల్ల డాక్టర్లు కూడా ఆమెకు తగిన చికిత్స అందించి ప్రాణాలు కాపాడగలిగారు. 

కొన్ని దేశాల్లో పచ్చి మాంసం, పచ్చి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటారు. వియత్నాంకి చెందిన 58 ఏళ్ల మహిళ కూడా అదే విధంగా పచ్చి రక్తం, వండిన మాంసంతో తయారు చేసిన టైట్ క్యాన్ తీసుకుంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. టేస్టీగా ఉంది కదా అని లాగించేసింది. చివరకు హాస్పిటల్ పాలైంది. శరీరమంతా పురుగులు పట్టి దారుణమైన పరిస్థితికి చేరుకుంది. చర్మం కింద పురుగులు గుట్టలు గుట్టలుగా గూడు కట్టేసుకున్నాయి. 

'టైట్ క్యాన్' అనే ఫుడ్ తిన్న తర్వాత తీవ్రమైన తలనొప్పితో బాధపడింది. నొప్పి భరించలేక  ఇంట్లోనే చాలా సార్లు కళ్లు తిరిగిపడిపోయింది. దీంతో ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఆమె మెదడులో పురుగులు ఉన్నట్టు వైద్యులు కనుగొన్నారు. డాంగ్ వ్యయాన్ న్గు హాస్పిటల్ వైద్యులు ఆమెకి అనేక పరీక్షలు, స్కాన్ లు చేశారు. చివరకు ఆమె చేతులు, కాళ్ళలో చర్మం కింద పురుగులు గుమిగూడినట్లు కనిపించాయి. అవి ఆమె మెదడులో కూడా గూడు కట్టుకున్నాయి. మొదట్లో తలనొప్పి అని రావడంతో సదరు మహిళ స్ట్రోక్ వల్ల అలా సంభవించిందని భావించారు. కానీ స్కానింగ్ తీసుకున్న తర్వాత ఆమె శరీరంలో పరాన్న జీవులు కుప్పలు తెప్పలుగా చేరినట్టు గుర్తించారు. పచ్చి రక్తంతో చేసిన ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్థారించారు. ఒకవేళ ఆమెని హాస్పిటల్‌కు తీసుకురాకపోతే పక్షవాతం లేదా చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.

అదృష్టవశాత్తూ ఆమె పరిస్థితికి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వంటని సదరు మహిళ స్వయంగా ఇంట్లో తయారు చేసుకుంది. బయట నుంచి తెచ్చుకుంటే రోగాలు వస్తాయని భావించి ఆమె అలా చేసిందంట. కానీ చివరకు ఆమె వంటే తనని ప్రమాదంలో పడేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఎదురైంది.

స్పెయిన్ లోని ఇలాంటి అరుదైన పరిస్థితితో ఒక వ్యక్తి వైద్యుల దగ్గరకి వచ్చాడు. వృత్తిరీత్యా మూరుగునీటి పారుదలలో పని చేసే స్పానిష్ వ్యక్తికి కూడా స్ట్రాంగ్‌లోయిడ్స్ స్టెర్కోరాలిస్ అనే పరాన్న జీవి శరీరంలోకి చెరిపోయింది. దురద, దద్దుర్లు, తేలికపాటి విరోచనాలు అనుభవించిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాడు. వైద్యులు అతన్ని పరీక్షించగా స్ట్రాంగ్‌లోయిడ్స్ స్టెర్కోరాలిస్ పరాన్నజీవి తన అనారోగ్యానికి కారణమని నిర్థారించారు. అతను హాస్పిటల్ కి వచ్చిన 24 గంటల్లో ఆ పరాన్నజీవులను వైద్యులు తొలగించారు. దీనికి సంబంధించిన ఫోటోస్ అప్పుడు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించారు. కాబట్టి, మీరు కూడా ఆహారాలు, పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. లేకపోతే చాలా ప్రమాదం.

Also Read: ఈ ఐదు ఆకుకూరలు సలాడ్‌కి జోడించారంటే టేస్ట్ సూపర్

Also Read: పిరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే పానీయాలు ఇవే

Published at : 13 Apr 2023 02:45 PM (IST) Tags: Headache Viral News Worm In Under Skin Vietnam Woman Rare Disease

సంబంధిత కథనాలు

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్