అన్వేషించండి

గోమూత్రాన్ని తాగొచ్చా? కొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి

మన దేశంలో గో మూత్రాన్ని పవిత్రంగా భావిస్తారు. గో మూత్రంలో ఎన్నో పోషకాలు ఉన్నాయనే నమ్మకంతో చాలామంది దాన్ని తీర్థంగా కూడా స్వీకరిస్తుంటారు.

మన దేశంలోని ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) తాజా అధ్యయనంలో గోమూత్రం గురించి ఆసక్తికర విషయాలను గురించి తేల్చిచెప్పింది.

ఆవులు, ఎద్దుల మూత్రం గురించి పీర్ రివ్యూడ్ రీసెర్చ్ లో కనీసం 14 రకాల హానికరమైన బ్యాక్టీరీయాలను కనుగొన్నారట. వీటిలో మానవ జీర్ణవ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపే ఎస్చెరేషియా కోలి బాక్టీరియం కూడా ఉందట. ఆవులు, గేదెలు, మానవుల 73 సాంపిల్స్ ను గణాంక విశ్లేషణకు ఉపయోగించి ఈ ప్రయోగాలు నిర్వహించారని, ఆవుల కంటే కూడా గేదెల్లో యాంటీ బాక్టీరియల్ యాక్టివిటి మరింత మెరుగ్గా ఉందని ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్న భోజ్ రాజ్ సింగ్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ విభాగానికి చెందిన సింగ్ మరో ముగ్గురు తన స్టూడెంట్స్ తో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. అధ్యయనానికి సాహివాల్, థార్ పార్కర్, విందావని (క్రాస్ బ్రీడ్) అనే మూడు రకాల ఆవులను ఎంచుకున్నారు. ఇందుకు స్థానిక పాడి పరిశ్రమల నుంచి ఎన్నుకున్నారు. వీటితో పాటు కొంత మనుషులు, గేదెల సాంపిల్స్ కూడా సేకరించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలో కూడా గణనీయ నిష్పత్తిలో వ్యాధికారక బ్యాక్టిరియా ఉంటుంది.

తాజా గోమూత్రానికంటే కూడా డిస్టిల్డ్ గోమూత్రంలో బ్యాక్టీరియా ఉండదని అంతా నమ్ముతుంటారు చాలా మంది అయితే దీని గురించిన క్లారిటీ ఇంకా రాలేదని ప్రయోగాలు సాగుతున్నాయని సింగ్ అంటున్నారు. కానీ ఆవు మూత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని సాధారణీకరించలేమని ఆయన అంటున్నారు.

అయితే ఇదే ఐవీఆర్ఐకి చెందిన మాజి డైరెక్టర్ ఆర్ ఎస్ చౌహాన్ ఈ పరిశోధన గురించి తన ప్రశ్నలను సంధించారు. ‘‘25 సంవత్సరాలుగా నేను గోమూత్రం మీద పరిశోధనలు చేస్తున్నాను. డిస్టిల్డ్ ఆవు మూత్రం మానవుల రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుందని, క్యాన్సర్, కోవిడ్ చికిత్సల్లో ఉపయోగించవచ్చని కనుగొన్నాం. సింగ్ జరిపిన ఈ పరిశోధన డిస్టిల్డ్ గోమూత్రం గురించి కాదు. మేమైతే గోమూత్ర సేవనం మంచిదే అని సిఫారసు చేస్తున్నాం’’ అని మీడియా కు వెల్లడి చేశారు.

ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ట్రేడ్ మార్క్ లేకుండానే గోమూత్రం దేశవ్యాప్తంగా అమ్ముడవుతోంది. అనేక వ్యాధులకు నివారణగా గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. హిందూ సంస్కృతిలో ఆవు, గో ఉత్పత్తులకు మతపరమైన పవిత్రత ఉంది. వినియోగం, విక్రయం మీద ఎలాంటి అదుపు లేకపోవడం అంత మంచిది కాదనే అభిప్రాయం ఉంది.

బీజేపీ ప్రభుత్వ హయాంలో గోమూత్రం, పేడ అనేక వ్యాధులకు చికిత్సగా నివారణగా ఉపయోగపడుతుందనే ప్రచారం చాలా ఉదృతంగా సాగుతోంది. అధికార పార్టీ మంత్రులు ప్రజాప్రతినిధులు మీడియా ముఖంగా చెప్పేంతవరకు వచ్చింది. పాండమిక్ సమయంలో గోమూత్రం తాగే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వాదనలన్నీ కూడా ఇప్పుడు అనుమానంలో పడ్డాయి. మరి ఈ పరిశోధన ఏ వివాదానికి దారితీస్తుందో చూడాలి.

Also read: ఏడాదికి ఒకసారి మాత్రమే పండే పంట హిమాలయన్ వెల్లుల్లి, దీని ధర అదిరిపోతుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget