Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి
Earplugs : నిద్ర ప్రశాంతంగా పట్టాలని ఇయర్ ప్లగ్స్ వాడుతున్నారా..అయితే ప్రమాదంలో పడ్డట్టే..గంటల తరబడి ఇయర్ ప్లగ్స్ వాడితే భారీ మూల్యం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Earplugs Side Effects : ఈ మధ్యకాలంలో సుఖవంతమైన నిద్ర కోసం చాలామంది రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. అందులో ఇయర్ ఫ్లగ్స్ కూడా ఒకటి. బయటి శబ్దాలేవీ వినిపించకుండా ప్రశాంతమైన నిద్రకు సహాయపడేలా వీటిని ఉపయోగిస్తారు. వీటిని చెవిలో పెట్టుకొని నిద్ర పోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర లభిస్తుందని నమ్ముతారు. అయితే ఇలాంటి ఇయర్ ఫ్లగ్స్ వాడటం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 7 నుంచి 8 గంటలు ఈ ఇయర్ ఫ్లగ్స్‌తో నిద్రపోవడం వల్ల చెవులకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ఇది కేవలం ఇయర్ ఫ్లగ్స్ వారికే కాదు, ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ నిద్రపోయేవారికి కూడా వర్తిస్తుంది. మరి, వాటిని వాడటం వల్ల ఇంకా ఏయే నష్టాలు ఉన్నాయో చూడండి.
ఇన్ఫెక్షన్స్:
ఇయర్ ఫ్లగ్స్‌ను ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలోపల ఉండే తేమ అక్కడే ఉండిపోయి.. అందులో బ్యాక్టీరియా ఉద్భవించే అవకాశం ఉందని గాలి సోకకపోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇయర్ ఫ్లగ్స్ ధరించే ముందు మీ చెవిని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెవి రంధ్రం బ్లాక్:
ఇయర్ ఫ్లగ్స్‌ను ఎక్కువసేపు చెవిలో పెట్టుకోవడం ద్వారా చెవి రంధ్రం బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవిలో గులిమి అక్కడే బ్లాక్ కావడం వల్ల.. మీ చెవి రంధ్రం బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందని, ఫలితంగా వినికిడి శక్తి కూడా తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెవి దెబ్బతినే ప్రమాదం:
చెవుల్లో ఇయర్ ఫ్లగ్స్‌ను ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల చెవి లోపలి భాగం దెబ్బ తినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం విషయానికి వస్తే మనం గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు చెవి లోపలి భాగంలోకి ఇయర్ ఫ్లగ్స్ చొచ్చుకొని వెళ్లి చెవి దెబ్బ తినే ప్రమాదం ఉందని అలాగే స్కిన్ ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చికాకు:
ఎక్కువసేపు ఇయర్ ఫ్లగ్స్ ను చెవిలో ఉంచుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా చెవిలోపల చికాకు కలిగే అవకాశం ఉందని శబ్దాలు ఏవి వినిపించకపోవడం ద్వారా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఇయర్ ఫ్లగ్స్ లేకుండానే నిద్రపోయేందుకు ప్రయత్నించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read : చలికాలంలో బిర్యానీ ఆకుల కషాయం తాగితే ఎంత మంచిదో తెలుసా?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply