అన్వేషించండి

Eye Stroke: హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌లాగే కంటి స్ట్రోక్ కూడా వస్తుంది, దీని లక్షణాలు ఇవే

అందరికీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించే తెలుసు, కానీ కంటికి కూడా స్ట్రోక్ వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు.

హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ప్రాణానికే ప్రమాదం. అదే కంటి స్ట్రోక్ వస్తే చూపు మొత్తం పోయే అవకాశం ఎక్కువ. కంటి స్ట్రోక్‌ను కంటి పక్షవాతం గా కూడా చెప్పుకోవచ్చు. ఇది కంటిలోని ఆప్టిక్ నరాలలోకి రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే ఒక సమస్య. ఈ కంటి స్ట్రోక్ వస్తే ఆకస్మికంగా కంటి చూపు పోతుంది. అంతవరకు కనిపించిన కళ్ళు అకస్మాత్తుగా దృష్టిని కోల్పోతాయి. ఇది ఆ మనిషిని నిలువునా కుంగదీసేస్తుంది. ఏం జరిగిందో తెలియక భయంతో ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఒకే కంటికి...
కంటి స్ట్రోక్ వచ్చే ముందు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. కానీ అవగాహన తక్కువ కాబట్టి చాలా మందికి దీని గురించి తెలిసే అవకాశం ఉండదు. కళ్ళలోని చిన్న రక్తనాళాలు దెబ్బ తినడం ద్వారా మొదటి లక్షణం కనిపిస్తుంది. అస్పష్టంగా కనిపించడం, చూపులో చీకటి ప్రాంతాలు లేదా నీడ లాంటివి కనిపించడం జరుగుతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం రెండు కళ్ళకు కంటి స్ట్రోక్ ఒకేసారి వచ్చే అవకాశం తక్కువే, ఒక కంటికి మొదట కంటి స్ట్రోక్ వస్తుంది. అప్పుడు వెంటనే చికిత్స తీసుకుంటే రెండో కంటికి రాకుండా కాపాడుకోవచ్చు. రెండు కళ్ళకు ఒకేసారి కంటి స్ట్రోకు వస్తే మాత్రం శాశ్వతంగా చూపు కోల్పోతారు.

ఎందుకు వస్తుంది?
ముందే చెప్పినట్టుగా కంటిలోని రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల ఈ స్ట్రోక్ వస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగా లేకపోయినా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆప్టిక్ నాడి అనేది మెదడును, కంటిని అనుసంధానించే ఒక నరం. దీనిలో మిలియన్ల కొద్ది నరాల ఫైబర్లు ఉంటాయి. ఈ ఆప్టిక్ నాడి దెబ్బతింటే కంటి స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి ఈ కంటి పక్షవాతం రక్తనాళాల్లో అడ్డంకులు లేకపోయినా కూడా కణజాలాలు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కూడా వస్తుంది. ఆప్టిక్ నరాలకు పోషకాలు, రక్,తం ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినా... ఈ స్థితి వచ్చే అవకాశం ఉంది. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే...
నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చెబుతున్న ప్రకారం 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ఈ కంటి స్ట్రోకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారికి కూడా ఇది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గ్లాకోమా వంటి కంటి సమస్యలతో బాధపడే వారు కూడా కంటి స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది.

కంటిస్ట్రోక్ వచ్చేటప్పుడు ఆ లక్షణాలు కొన్ని సార్లు రోజుల తరబడి నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. అలా కాకుండా ఒక్కోసారి అకస్మాత్తుగా పిడుగు పడినట్టు కూడా జరగవచ్చు. మీరు చూస్తున్నప్పుడు బూడిద రంగు మచ్చలు కనబడుతున్నా, కంటి మధ్యలో రక్తం లేదా ద్రవాలు లీక్ అవుతున్నా కూడా అది స్ట్రోక్ కు వల్ల అవ్వచ్చు. కంటిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడి అనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు. కన్నుల్లో కొంత భాగం మబ్బు మబ్బుగా కనిపించడం కూడా కంటి స్ట్రోక్ లక్షణమే. 

చికిత్స ఇలా
నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి స్ట్రోక్ చికిత్స అనేది స్ట్రోక్ వల్ల కన్ను ఎంత నష్టపోయింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నష్టం తక్కువగా ఉంటే కంటి ప్రాంతాన్ని మసాజ్ చేయడం వంటివి చేస్తారు. లేజర్ చికిత్స అందిస్తారు. 

Also read: పావురాలకు దూరంగా ఉండమని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? వాటితో వచ్చే సమస్యలేంటి?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget