అన్వేషించండి

Diabetes Diet: డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే 10 సూపర్ ఫుడ్స్ ఇవే - ఈ రోజు నుంచే మొదలుపెట్టండి

World Diabetes Day 2023 : కేవలం మందులు మాత్రమే కాదు లైఫ్ స్టైల్, ఆహార మార్పులతో కూడా డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

Diabetes Day 2023: డయాబెటిస్ అంటే ఒక స్లో పాయిజన్. చెప్పాపెట్టకుండా వచ్చేస్తుంది. శరీరంలో తిష్టవేసి అనేక రోగాలకు కారణమవుతుంది. నెమ్మదిగా శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని నరకం చూపిస్తుంది. చివరికి ప్రాణాలు హరిస్తుంది. అందుకే, ఏటా నవంబరు 14వ తేదీన.. ప్రజలకు ఈ మహమ్మారిపై అవగాహన కలిగించేందుకు ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ డయాబెటిస్ డే’ను పాటిస్తున్నారు. డయాబెటిస్ వల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. ఎక్కువమంది గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలకు గురవ్వుతున్నారు. మీరూ ఈ వ్యాధికి గురికాకూడదంటే.. తప్పకుండా ఈ కింది ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోండి.

బ్రోకలీ:

మధుమేహం విషయంలో బ్రోకలీ సూపర్‌ఫుడ్‌ అని చెప్పొచ్చు. ఇందులో ఉత్పత్తి అయ్యే సల్ఫోరాఫేన్ అనే మూలకం  డయాబెటిస్ నివారణలో ఉపయోగపడుతుంది.  పోషకాహార నిపుణులు, డైటీషియన్ల ప్రకారం, బ్రోకలీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో చేయడంలో సహాయపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ కూరగాయలను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

గుమ్మడికాయ గింజలు:

గుమ్మడికాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలీసాచరైడ్స్ వంటి పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి, రక్తంలో షుగర్  స్థాయిలను నియంత్రించడానికి గుమ్మడికాయ తప్పనిసరి. అలాగే గుమ్మడికాయ గింజలు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండి ఉంటాయి, పరిశోధన ప్రకారం ఇందులోని డైటరీ పాలిసాకరైడ్‌లు టైప్ 2 డయాబెటిస్ రోగులలో హైపర్‌గ్లైసీమియా, హైపర్‌లిపిడెమియా సమస్యలను మెరుగుపరుస్తాయి. 

వేరుశెనగలు, జీడిపప్పు, బాదంపప్పులు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహాన్ని నిర్వహించడానికి, రక్తంలో షుగర్  స్థాయిలను నియంత్రించడానికి మీరు మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా వేరుశెనగలు, జీడిపప్పు, బాదంపప్పులు జోడించాల్సి ఉంటుంది. ఇవి ప్రోటీన్ కు మంచి మూలం. బాదం, వేరుశెనగ, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి ఆహారాల్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రోటీన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల అద్భుతమైన మూలం. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, స్ట్రోక్ ప్రమాదాలు, పిత్తాశయ రాళ్లను నివారించడం ద్వారా గుండె జబ్బులతో పోరాడటానికి ఇవి సహాయపడతాయి. 

బెండకాయ:

ఈ కూరగాయ రక్తంలో షుగర్  స్థాయిలను తగ్గించడంలో కీలకమైన పాలీశాకరైడ్లు, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది. ఇందులోని ప్రధాన పాలీశాకరైడ్ అయిన రామ్‌నోగలాక్టురోనన్ శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ సమ్మేళనం పలు అధ్యయనాల్లో పేర్కొన్నారు. అదనంగా, ఇది కొన్ని ఎంజైమ్‌లను నిరోధించడం ద్వారా రక్తంలో షుగర్ ను కూడా తగ్గిస్తుంది.

అవిసె గింజలు:

ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. మీరు మీ HbA1c కౌంట్‌ను గణనీయంగా తగ్గించాలంటే పెరుగులో అవిసె గింజలను కలిపి తింటే చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్  ఒక సర్వింగ్ ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గొప్ప మూలం అని డైటీషియన్లు అంటున్నారు, ఇది బరువును నిర్వహించడానికి, కొలెస్ట్రాల్ , రక్తపోటును తగ్గిస్తుంది. 

బెర్రీలు:

యాంటీఆక్సిడెంట్లతో నిండిన బెర్రీలు రక్తంలో షుగర్ తగ్గడానికి ఉపయోగపడతాయని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. 250 గ్రాముల ఎర్రటి రాస్ బెర్రీ పండ్లు తినడం వల్ల ప్రీడయాబెటిస్ ఉన్న పెద్దలలో భోజనం తర్వాత ఇన్సులిన్, రక్తంలో షుగర్ తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలింది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ ,  బ్లాక్‌బెర్రీలు కూడా రక్తంలో షుగర్ ను నిర్వహించడానికి మంచివి.

పెరుగు:

పెరుగు మీ శరీరంలో రక్తంలో షుగర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ సుమారు పెరుగు తింటే రక్తంలో షుగర్ ,  HbA1cని తగ్గిస్తుంది. అదేవిధంగా, రోజూ 150 గ్రాముల పెరుగు తిన్నట్లయితే, ఇన్సులిన్, రక్తంలో షుగర్  స్థాయిలను మెరుగుపరుస్తుంది. 

యాపిల్స్:

యాపిల్స్‌లో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్, గాలిక్ యాసిడ్‌లతో సహా కరిగే ఫైబర్, సమ్మేళనాలు ఉన్నందున మధుమేహాన్ని నిర్వహించడానికి మంచివిగా పరిగణించవచ్చు. మధుమేహం నుండి మిమ్మల్ని రక్షించడంలో ఇవి సహాయపడతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, భోజనానికి 30 నిమిషాల ముందు యాపిల్స్ తినడం వల్ల  భోజనం తర్వాత రక్తంలో షుగర్‌ను గణనీయంగా తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది.

Also Read : తలస్నానం చేసేప్పుడు ఆ తప్పులు చేస్తే మీ జుట్టు హాంఫట్!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Embed widget