News
News
వీడియోలు ఆటలు
X

డయాబెటిస్ పీడ వదిలించుకోవాలని ఉందా? జస్ట్ ఇలా చేస్తే చాలు, మళ్లీ రానేరాదు!

కొత్తగా వెలువడిన డేటా ప్రకారం 4,3 మిలిన్ల మంది మధుమేహులుగా నిర్థారించబడ్డారు. ఇది ఇలాగే పెరుగుతూ పోవడం అనేది ప్రపంచం చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సంక్షోభానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

ప్రపంచంలో మధుమేహుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దీని మీద నియంత్రణ సాధించడం ఇప్పుడు ప్రపంచం ముందున్నముఖ్యమైన సవాల్. డయాబెటిస్ బారిన పడిన వారిలో సమస్య అదుపుతప్పితే అంప్యూటేషన్ నుంచి గుండెపోటు వరకు రకరకాల ప్రాణాంత పరిస్థితులు ఏర్పడవచ్చు. డయాబెటిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని కొన్ని జీవన శైలి సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణుల సూచనలు అందిస్తున్నారు.

స్వీట్లు, కూల్ డ్రింక్స్, చాక్లెట్, వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి సాధారణ కార్బోహైడ్రేట్లను తీసుకోవద్దు. సింపుల్ కార్బోహైడ్రేట్లు వెంటనే బ్లడ్ షుగర్ పెరిగేందకు కారణం అవుతాయి. రోజంతా తీసుకునే షుగరీ ఫూడ్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తింటే రక్తంలో చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. రక్తంలో పెరిగిన షుగర్ వల్ల వెంటనే నిద్ర నాణ్యత, శారీర శక్తి, వ్యాయమం చెయ్యడంలో ఇబ్బంది వంటివి వెంటనే కనిపించే లక్షణాలైతే దీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే అది టైప్ 2 డయాబెటిస్ కి దారితీస్తుందని డైటీషన్లు హెచ్చరిస్తున్నారు. రక్తంలో పోగుపడిన గ్లూకోజ్ క్రమంగా అవయవ కణజాలలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బులు, పక్షవాతం వంటి నాడీ సంబంధ ప్రమాదాలకు కారణం అవుతుంది.

ఏం తినాలి?

హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లకు మారిపోవాలి. టోస్ట్ మీద వెన్నరాసుకుని తినడం, చపాతి మీద వెన్న వేసి కాల్చుకుని తినడం రుచిగా ఉంటుందేమో కానీ టైప్ 2 డయాబెటిస్ ను రివర్స్ చెయ్యాలన్న ఆలోచనలో ఉన్నవారికి ఇలా తినడం అసలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ అంటే వెన్న, నెయ్యి, వనస్పతి వంటివాటికి దూరంగా ఉండాలి.

సాచ్యూరేటెడ్ లేదా ట్రాన్స్ ఫ్యాట్ తో చేసిన లేదా అవి అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నపుడు అది ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను డెవలప్ చేస్తుంది. అంతేకాదు లివర్, పాంక్రియాస్ చుట్టు పక్కల అవయవాలలో కొవ్వు పేరుకుపోవడానకి కారణం అవుతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకంగా మారవచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా.. వేయించిన ఆహారం, బేక్ చేసిన కేకులు, పేస్ట్రీలు, క్రీం, వెన్న వంటి పాల ఉత్పత్తుల్లో ఉంటాయి.

ఏ నూనెలు వాడాలి?

అన్ సాచ్యూరేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మంచివి. పొద్దుతిరుగుడు, వాల్నట్ నూనె, ఆలివ్ నూనె మంచిది. సాల్మన్, సార్టనెస్, మకేరెల్ వంటి నూనె కలిగిన చేపలు ఒమెగా 3 కోసం తినడం మంచిది.

ఫైబర్ ఫుడ్ తింటే మంచిది

డయాబెటిస్ మేనేజ్మెంట్ లో ప్రీబయోటిక్ ఆహారాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థలోని నీటిని పీల్చుకుంటుంది. త్వరగా జీర్ణవ్యవస్థ ఖాళీ కాకుండా ఉంటుంది. నెమ్మదిగా జీర్ణమయ్యే వీటి తత్వం వల్ల త్వరగా రక్తంలోకి గ్లూకోజ్ విడుదల కాదు. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ను రివర్స్ చెయ్యడానికి వీలైనంత ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. జీర్ణవ్యవస్థలో ఉండే మేలు చేసే బ్యాక్టీరియాకి ప్రీబయోటిక్స్ లో ఉండే ఫైబర్ మంచి ఆహారం కూడా. బ్యాక్టీరియాకు తగినంత ఆహారం ఇవ్వడం వల్ల షార్ట్ చైన్ ఫ్యాటీ ఆసిడ్ మాలీక్యూల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది డయాబెటిస్ ను రివర్స్ చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓట్స్, బార్లీ, ఉల్లి, ఆస్పరాగస్, బీన్స్ వంటివి ప్రీబయోటిక్స్ ఉండే కొన్ని పదార్థాలు. వీటిని వీలైనంత ఎక్కువ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also read: ఆరేళ్ల బాలికకు వింత వ్యాధి, ఈమె శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 19 Apr 2023 07:00 AM (IST) Tags: Diabetes food diabetes treatment Diabetics Type 2 Diabetes reverse type 2 diabetes

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!