X

Kidney Stones: మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో రాళ్లను తరిమికొట్టండి... ఆరోగ్యంగా ఉండండి

ప్రతి రోజూ తగినన్నినీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నీళ్లు ఒకటే కాదు మంచి ఆహారం తీసుకోకపోవడం కూడా రాళ్లు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు.

FOLLOW US: 

ప్రతి రోజూ తగినన్నినీళ్లు తాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. నీళ్లు ఒకటే కాదు మంచి ఆహారం తీసుకోకపోవడం కూడా రాళ్లు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వాటి పని తీరు సరిగ్గా ఉంటేనే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. సున్నితంగా ఉండే వాటిని కాపాడుకోవాలంటే తగినన్ని నీళ్లు తాగడమే కాకుండా, సరైనా పోషకాహారాన్ని తీసుకోవాలి. అయితే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు? కిడ్నీల్లో రాళ్లను వంటింటి చిట్కాలతో ఎలా కరిగించవచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీల్లో రాళ్లు కరిగించే వంటింటి చిట్కాలు
* ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని తాగితే, రాళ్లను సులభంగా కరిగించవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో ఇలా తాగడం మరింత ప్రయోజనకరం.
* రణపాల మొక్క ఆకు, కాస్త చక్కెర కలిపి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. తద్వారా స్టోన్స్‌ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* యాలకుల్లోని గింజలను పొడిగా చేసి, ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ పొడిని కలపండి. స్పూన్ చక్కెర, కొన్ని పుచ్చకాయ గింజలను ఆ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని తాగండి. కొన్నిరోజుల పాటు ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగి తినండి. అలాగే ఉదయం ఎక్కువగా నీళ్లు తాగండి. కొన్ని రోజులు ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను పిండుకుని.. అందులో కొద్దిగా ఆలివ్ నూనెను కలపండి. ఇక ఆ నీటిని తాగండి. కొద్దిరోజులు ఇలా చేయడం వల్ల మీరు సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
* ఆపిల్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి సహాయపడుతుంది. రోజూ వెచ్చని నీటితో రెండు టీస్పూన్ల వెనిగర్ తీసుకోవడం వల్ల సమస్యకు దూరం కావచ్చు. 
* మరోవైపు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఉప్పు తక్కువ ఉన్న కూరలను తినాలి. అలాగే మాంసం తీసుకోవడం తగ్గించాలి. చాక్లెట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను తగ్గించాలి.

లక్షణాలు: 

* కిడ్నీలో రాళ్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ భాగంలో నొప్పి వ‌స్తుంటుంది. లేదంటే ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు ఉన్నట్లు ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించాలి. ఒకవేళ కిడ్నీలో స్టోన్లు ఉంటే.. ఆ మేర‌కు చికిత్స తీసుకుని రాళ్లను తొల‌గించుకోవాలి.

* మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.

* వాంతి వ‌చ్చిన‌ట్లు ఉండ‌టం, వికారం, వ‌ణ‌ుకు, జ్వరం వంటి ల‌క్షణాలు ఉంటే... కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. 

ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. 

Tags: LifeStyle Health Kidney Stones Kidneys

సంబంధిత కథనాలు

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ లైఫ్.. చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై అయితే..!

Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ లైఫ్.. చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్‌పై అయితే..!

Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పదివేలకుపైగా కేసులు..

Corona Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పదివేలకుపైగా కేసులు..

టాప్ స్టోరీస్

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

AP Employees Unions : జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

AP Employees Unions :  జీతాల బిల్లులపై ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు .. ఒత్తిడి చేస్తే వెంటనే సమ్మెకు వెళ్తామన్న ఉద్యోగ నేతలు !

Balakrishna : రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !

Balakrishna :  రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !