అన్వేషించండి

Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి

Adulterated Milk : పాలు కల్తీగా ఉన్నాయి అనిపిస్తుందా? ఈ డౌట్ ఉంటే ఇంట్లో కొన్ని చిట్కాలు ఫాలో అయితే కల్తీపాలను గుర్తించవచ్చని చెప్తున్నారు. మరి అవేంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పాలలో నీరు, పిండి పదార్థాలను సులువుగా గుర్తించవచ్చు.
  • డిటర్జెంట్, రుచి మార్పులు కల్తీ సంకేతాలు.
  • ఇంటి పరీక్షలు ప్రాథమికం, ల్యాబ్ పరీక్షలు కచ్చితమైనవి.

Pure Milk or Adulterated Milk : పాలను దాదాపు ప్రతీ ఇంట్లోనూ వినియోగిస్తారు. టీ, కాఫీలతో పాటు ఆరోగ్యం కోసం పాలు తీసుకోవడం.. పాలకు సంబంధించిన ఉత్పత్తుల కోసం పాలను ఉపయోగిస్తారు. అయితే పాల స్వచ్ఛతపై చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే పాలు మరీ నీరుగా ఉండడం, వాసన, రుచిలో తేడాలు గమనించినప్పుడు ఇవి ఎక్కువ అవుతాయి. అలాంటి సమయాల్లో పాలల్లో నీరు, పిండిపదార్థం వంటి వాటితో కల్తీ జరిగిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయి. మరి ఇంట్లో కల్తీ పాలు ఎలా గుర్తించవచ్చో చూసేద్దాం.

పాలు పల్చగా ఉంటే..

పాలలో నీరు కలిపితే దాని చిక్కదనం తగ్గవచ్చు. దీనిని ప్రాథమికంగా తెలుసుకోవడానికి శుభ్రమైన, నునుపైన ప్లేట్‌ను కొద్దిగా వంచి దానిపై కొన్ని చుక్కల పాలు పోయండి. పాలు నెమ్మదిగా కిందికి జారుతూ వెనుక తెల్లటి జాడను వదిలితే అందులో ఉండే కొవ్వు, ప్రొటీన్ల ప్రభావం కావచ్చు. పాలు చాలా వేగంగా జారిపోతే నీరు కలిపి ఉండే అవకాశం ఉందని గుర్తించవచ్చు.

Also Read : టీ పర్​ఫెక్ట్​గా రావాలంటే ముందుగా పాలు వేయాలా? లేదా నీళ్లా? బెస్ట్ టేస్ట్ కోసం ఈ పద్ధతి ట్రై చేయండి

పిండి కలిపారేమో తెలుసుకునేందుకు..

కొన్నిసార్లు పాలను నీటితో పలుచగా చేసి.. తర్వాత అవి చిక్కగా కనిపించేలా కొన్ని పిండిపదార్థాలను కలిపే అవకాశం ఉంది. దీనిని గుర్తించడానికి కొద్దిగా పాలను ఒక గిన్నెలో తీసుకుని వేడిచేయాలి. చల్లారిన తర్వాత రెండు లేదా మూడు చుక్కల అయోడిన్ ద్రావణం వేయాలి. పాలు నీలం లేదా నలుపు రంగు మార్పు కనిపిస్తే పిండిపదార్థం ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఎందుకంటే అయోడిన్ పిండిపదార్థంతో చర్య జరిపినప్పుడు రంగు మారుతుంది.

పాలల్లో డిటర్జెంట్ కలిపితే..

డిటర్జెంట్ కల్తీపై అనుమానం ఉంటే కొద్దిగా పాలను ఒక సీసాలో తీసుకుని.. దానికి సమాన పరిమాణంలో నీరు కలిపి మెల్లగా ఊపవచ్చు. సాధారణ పాలలో కూడా కొద్దిగా నురుగు రావడం సహజమే. కానీ సబ్బు నురుగులా ఎక్కువగా ఏర్పడి.. చాలా సేపు అలాగే ఉంటే కల్తీపై అనుమానం రావచ్చు. 

Also Read : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?

వాసన, రుచిలో మార్పులు

పాలు సాధారణం కంటే భిన్నమైన వాసన రావడం, సబ్బు రుచి అనిపించడం లేదా అకస్మాత్తుగా చాలా పల్చగా కనిపించడం వంటి మార్పులను లైట్ తీసుకోకండి. ఇవి పాల నాణ్యతలో సమస్య ఉందనే సంకేతాలు ఇస్తాయి.

పాలు చిక్కగా ఉంటేనే మంచివా?

చాలామంది చిక్కగా ఉండే పాలను మంచి నాణ్యత కలిగినవిగా భావిస్తారు. కానీ కల్తీ పదార్థాల వల్ల కూడా పాలు చిక్కగా కనిపించే అవకాశం ఉంది. కేవలం రంగు లేదా చిక్కదనం చూసి పాలు స్వచ్ఛమైనవని నిర్ధారించడం సాధ్యం కాదు.

Also Read : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే

మరిగిస్తే కల్తీ పోతుందా?

పాలను మరిగించడం వల్ల కొన్ని సూక్ష్మజీవుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కానీ నీరు, పిండిపదార్థం, డిటర్జెంట్ వంటి కల్తీ పదార్థాలను మరిగించడం ద్వారా తొలగించలేం.

కల్తీ పాలని డౌట్ ఉంటే..

ఇంట్లో చేసే పరీక్షల్లో ఏదైనా అసాధారణమైన రిజల్ట్స్ వస్తే.. పాలు కల్తీవేనని తుది నిర్ణయం తీసుకోకూడదు. పాల నాణ్యతపై మీకు డౌట్ ఉంటే సంబంధిత ఆహార భద్రతా అధికారులను సంప్రదించి శాస్త్రీయంగా టెస్ట్ చేయించుకోవడం, ల్యాబ్ టెస్ట్ చేయించడం మంచిది. ఎందుకంటే ఇంటి పరీక్షలు పాలలోని కొన్ని సాధారణ కల్తీ పదార్థాలపై ప్రాథమిక సూచన మాత్రమే ఇస్తాయి. అన్ని రకాల కల్తీలను గుర్తించడానికి ల్యాబ్ టెస్ట్ మంచి మార్గం. 

Also Read : పాలు తాగాలంటే భయంగా ఉందా? కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించే ఈజీ చిట్కాలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Dry Skin in Winter : చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget