By: ABP Desam | Updated at : 29 Nov 2022 12:06 AM (IST)
కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి (Pexels.com)
Men Suicide Cases increased: ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవారిదని అంటుంటారు. కానీ ఆ మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేస్తోంది. రెండున్నరేళ్ల కిందట కోవిడ్ 19 మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇంటి బరువు బాధ్యతలు, కుటుంబాన్ని పోషించడం, పిల్లల చదువులు, రోజువారీ ఖర్చులు, వీటన్నింటిని మించి ఉద్యోగంలో పని ఒత్తిడి, వ్యాపారంలోనూ ఒడిదొడుకులు మగ మహారాజుల ప్రాణాల్ని బలిగొంటున్నాయి.
ఆత్మహత్యలను పరిశీలిస్తే.. 192 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 165 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. ఉద్యోగులు 28 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 25 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. స్వయం ఉపాధి చేస్తున్నవారు 1,953 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 1,732 మంది పురుషులు, 221 మంది మహిళలు ఉన్నారు.
వైద్య నిపుణుల ప్రకారం ఆత్మహత్య (Suicide)కి దారి తీయడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మగవారికి అనేక విధాలుగా కుటుంబ బాధ్యత, పిల్లల చదువుల ఖర్చులు, రోజువారీ పెరుగుతున్న ఖర్చులు, బ్యాక్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడం, సైకలాజికల్, ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, బాధని పంచుకోవడానికి సరైన వ్యక్తి లేకపోవడం లాంటి కారణాలన్నీ ఆత్మహత్యకు ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మగవారికి సామజిక భాద్యత, కుటుంబ భాద్యత, ఉద్యోగ, ఆర్థిక పరమైన భాద్యతలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రీ ఎక్సిస్టింగ్ డిప్రెషన్ లక్షణాలు ఉన్నవారిలో సూసైడ్ త్వరగా చేసుకుంటారు. ఎందుకంటే వారిలో ఏదైనా తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారికి తప్పకుండా సైకలాజికల్ కౌన్సెలింగ్ (Psychological Councelling) తప్పనిసరి. మహిళలకు సమస్య ఎదురైనా ముందుకెళ్లే స్వభావం సహజకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి కుటుంబ బరువు బాధ్యతలు లాంటి ఒత్తిడి తక్కువగా ఉండటం ఓ కారణంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల కన్నా మగవారిలో ఆత్మహత్యలు పెరిగిపోతుంటాయి.
మగవారిలో సూసైడ్ ఆలోచనలు తగ్గించాలంటే తరచుగా వారితో మాట్లాడుతూ ఉండాలి. కుటుంబసభ్యులు ఎప్పటికపుడు వారి పరిస్థితులు గమనిస్తూ వారికి అవసరం ఉన్నపుడు ఎమోషనల్ సపోర్ట్ అందించాలి. పరిస్థితిని అర్థం చేసుకుని మెలగడం ముఖ్యమైన విషయమని డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు.
కరోనా కారణంగా చాలా కుటుంబాల్లో అనేక సమస్యలు ఇప్పటికి వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ కోసం, అలాగే ఉమ్మడి కుటుంబంలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని క్లినికల్ సైకోథెరపిస్ట్ (clinical psycho terapist) లావణ్య వెల్లడించారు. ABP Desam తో వారు మాట్లాదుతూ.. సాధారణంగా లింగ వ్యవక్ష అనేది ఇలాంటి పరిస్థితుల్లో మగవారిలో చూస్తుంటాం. ఎప్పుడైనా ఆడవారు ఏడ్చినe, బాధ పడినా నలుగురు సాయం చేసేందుకు ముందుకొస్తారు. అదే పరిస్థితుల్లో మగవారు కనిపిస్తే.. నువ్వు మగాడివి, ఆడపిల్లలా ఏడుస్తావ్ ఏంటి? అని భావోద్వేగాలను సైతం చూపెట్టకుండా నియంత్రిస్తుంటారు. పైగా ఏడుస్తున్నావంటూ వారిని హేళన చేసే వారు అధికం. ఇలాంటి పరిస్థితులు సూసైడ్ చేసుకోడానికి మరింత దోహదం చేస్తాయని, అలా జరగకూడదంటే మగవారిపై సాఫ్ట్ కార్నర్ చూపించి, బాధలో ఉన్నప్పుడు వారితో మాట్లాడటం, మానసిక మద్దతు తెలపాల్సిన బాధ్యత సమాజంలో మనందరిది అన్నారు క్లినికల్ సైకాలజిస్ట్ లావణ్య.
Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే
Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!