Health News : నెలకు 21 సార్లు హస్తప్రయోగం చేస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు - శాస్త్రవేత్తల రిపోర్టులు ఇవే
Prostate Cancer : పురుషులకు ప్రాణాంతకంగా మారే రోగాల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది రాకుండా ఏం చేయాలో కొన్ని పరిశోధనలు కీలక విషయాలు వెల్లడించాయి.
Masturbating more than 21 times a month decrease risk of prostate cancer : మారుతున్న జీవన శైలి కారణంగా మనుషులను అనేక రోగాలు వెంటాడుతున్నాయి. శరీరంలో ఏ పార్ట్‌కి ఎలాంటి రోగం వస్తుందో చెప్పలేని పరిస్థితి. మొత్తం శరీరాన్ని చెక్ చేసుకుంటే ఏదో ఓ సమస్య బయటపడుతుందని వైద్య నిపుణులు చెబుతూంటారు.ఇలా తెలియకండా శరీరంలో పాకిపోయే రోగాల్లో ఒకటి క్యాన్సర్. ఏ భాగానికైనా రావొచ్చు. మగవారికి కాస్త ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో ఒకటి ప్రొస్టేట్ క్యాన్సర్.
ప్రొస్టేట్ క్యానర్ రావడానికి కారణాలేమిటి.. రాకుండా ఏం చేయాలన్నదానిపై చాలా కాలంగా వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిశోధనల్లో కొన్ని కీలకమైన విషయాలను తరచూ ప్రకటిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి హస్త ప్రయోగం. నెలలో 21 సార్లు హస్త ప్రయోగం చేసుకునే వాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది.
గుండె పదిలమేనా? ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!
2016లో ప్రఖ్యాత హార్వార్డ్ యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలను ప్రచురించారు. ఇందులో 30 వేల మంది హార్వార్డ్ వైద్య నిపుణులు పరిశీలించారు. నెలకు నాలుగైదు సార్లు హస్త ప్రయోగం చేసుకునేవారితో పోలిస్తే 21 సార్లు చేసుకునేవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఇరవై శాతం తక్కువగా ఉందని తేలింది. తర్వాత 2018లో వచ్చిన మరో రిపోర్టులోనూ ఇదే విషాయన్ని చెప్పింది. ఎజాక్యులేషన్ ఎక్కువగా ఉన్న వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు.
అయితే ఈ పరిశోధనలు ఏవీఇంకా అధికారికంగా వైద్య రికార్డుల్లో నిరూపితమైనవిగా చేరలేదు. హార్వార్డ్ యూనివర్శిటీ సర్వేలో.. పురుషులను కేటగిరీలు, లైఫ్ స్టైల్స్ వారీగా వర్గీకరించలేదు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ.. ప్రొస్టేట్ క్యానర్ రాకుండా చేసుకోవడానికి ఎలాంటి ప్రత్యేకమైన పద్దతులు ఇంకా కనిపెట్టలేదని అయితే.. ఎజాక్యులేషన్ ఎక్కువగా ఉన్న వారిలో రిస్క్ తక్కువేనని మాత్రం స్పష్టం చేసింది.