Corona Cases: 555 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు.. 98.36 శాతానికి చేరిన రికవరీ రేటు
దేశంలో కొత్తగా 8,439 కేసులు నమోదుకాగా 195 మంది మృతి చెందారు
దేశంలో రోజువారి కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కొత్తగా 8,439 కేసులు నమోదుకాగా 195 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 93,733కు చేరింది. గత 555 రోజుల్లో ఇదే అత్యల్పం.
India reports 8,439 new #COVID19 cases, 9,525 recoveries, and 195 deaths in the last 24 hours
— ANI (@ANI) December 8, 2021
Active cases: 93,733
Total recoveries: 3,40,89,137
Death toll: 4,73,952
Total vaccination: 129.5 crore doses pic.twitter.com/h8SheZoVDD
- మొత్తం కేసులు: 34,656,822
- మరణాలు: 4,73,952
- యాక్టివ్ కేసులు: 93,733
- కోలుకున్నవారు: 3,40,89,137
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. మరణాల సంఖ్య 4,73,952కు పెరిగింది. మొత్తం రికవరీల సంఖ్య 3,40,89,137కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు.
వ్యాక్సిన్..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 129.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ కేసులు..
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.
Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి