By: ABP Desam | Updated at : 15 Jan 2022 04:49 PM (IST)
వ్యాక్సిన్ వద్దని కరోనా అంటించుకుంటున్నారు..!
కరోనా పాజిటివ్ వ్యక్తి అని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు?. బాబోయ్ అని అతని నుంచి దూరంగా పారిపోతారు. కానీ వారిని ప్రత్యేకంగా పిలిచి పార్టీలిచ్చి.. హగ్గులిచ్చి ... అంతా అయిపోయాక కాసిని డబ్బులిచ్చి పంపించేవారు ఎవరైనా ఉంటారా?. ఎవరు ఉంటారండి బాబూ.. కావాలని కరోనా అంటించుకోవాలనుకునేవాళ్లు తప్ప. అని అనిపిస్తుంది కదా.. నిజంగానే ఇలాంటి వాళ్లు ఉన్నారు. తమకు కరోనా రావాలని కోరుకంటూ.. పాజిటివ్ పేషంట్లకు డబ్బులిచ్చి మరీ పార్టీలకు పిలుస్తున్నారు. వాళ్లతో నవ్వుతూ తుళ్లుతూ గడుపుతున్నారు. తర్వాత తమకు పాజిటివ్ వచ్చిందా లేదా అని గంట గంటకు టెస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇది మన దేశంలో కాదు.. ఇటలీలో.
ఇటలీలో ఇప్పుడు కరోనా పాజిటివ్ పేషంట్లకు భలే డిమాండ్ ఉంది. తమతో పార్టీలకు వస్తే డబ్బులిస్తామని ఆఫర్ చేస్తున్నారు. అలా చాలా మంది వెళ్తున్నారు కూడా. అలా పిలుస్తోంది.. తమకు కరోనా అంటుకోవాలన్న లక్ష్యంతోనే . అలా అంటుకోకపోతే వారి ఉద్యోగులకు రిస్క్ ఉంది మరి. అక్కడి ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు, భారీ జరిమానా లేదా వాళ్ల ఉద్యోగం వదిలేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also Read: దేశంలో 24 గంటల్లో రెండున్నర లక్షల కేసులు.. తగ్గేదే లేదంటున్న ఒమిక్రాన్...
అయితే వ్యాక్సిన్ వేసుకోవడానికి అక్కడ చాలా మంది ఇష్టపడటం లేదు. కరోనా సోకినా పర్వాలేదు కానీ వ్యాక్సిన్ మాత్రం వద్దంటున్నారు. ఇలాంటి వారు ఓ నిబంధననను అడ్డం పెట్టుకుంటున్నారు. అదేమిటంటే కరోనా బారిన పడి కోలుకున్న వారిలో యాండీబాడీస్ వృద్ధి చెందే వరకు వ్యాక్సిన్ వేసుకోకూడదు. ఇంతకు మించి మంచి మార్గం దొరకదని డిసైడయ్యి.. కరోనా అంటించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
Also Read: మొన్న కుక్క బర్త్‌డే.. నేడు కోతి అంత్యక్రియలు..! కరోనా అంటే అంత కామెడీ అయిపోయిందా ?
దీంతో కోవిడ్ వచ్చిన పేషెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ వాళ్లతో డిన్నర్ చేస్తున్నారు. వాళ్లతో కూర్చొని వైన్ తాగుతున్నారు. దీని ద్వారా తమకు కూడా వైరస్ సోకితే వ్యాక్సినేషన్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ నోటా.. ఈ నోటా పడి.. ఈ విషయం ప్రభుత్వ వర్గాలకూ తెలిసింది. అందుకే వ్యాక్సిన్‌ను తప్పించుకోవడం కోసం కోవిడ్ పార్టీల పేరుతో మహమ్మారిని తెప్పించుకుంటే వాళ్లపై కేసులు నమోదు చేస్తామని ఇటలీ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ఎవరి పని వాళ్లదే.. !
Also Read: Tollywood Jagan : ‘టాలీవుడ్ రియాక్షన్’ ఆపడమే అసలు వ్యూహం! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా?
Intermittent Fasting: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుష్షు పెంచుతుందా? అధ్యయనంలో ఏం తేలింది?
Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే నరాలు దెబ్బతినే ప్రమాదం - డయాబెటిక్ రోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే
Menopause: మెనోపాజ్ ముందస్తుగా వస్తే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు
గీజర్లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Cough: దగ్గు వచ్చినప్పుడు ఆపుకుంటున్నారా? దగ్గడం ఎంత ముఖ్యమో తెలుసా
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం