Fruit Eating Tips:పండ్లు తినే సరైన విధానం ఏది? కొరుక్కుని తినాలా? కోసి తినాలా? పోషకాలు ఎలా కాపాడుకోవాలి?
Fruit Eating Tips: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ ఎలా తినాలి? చాకుతో కోసుకొని ముక్కలుగా చేసి తినాలా? లేక నేరుగా నోటితో కొరుక్కొని తినాలా? ఈ ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి.

What is Correct Way to Eat Fruit:పండ్లు మన డైట్‌లో అంతర్భాగం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రోజుకు కనీసం 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలి. కానీ తినే విధానం మీద ఆధారపడి పోషకాలు మారతాయి. నేరుగా కొరుక్కొని తినడం వల్ల పూర్తి ఫైబర్, ఎంజైమ్‌లు లభిస్తాయి. చాకుతో కోసుకొని తినడం వల్ల సులభంగా షేర్ చేయవచ్చు కానీ, ఆక్సీడేషన్ వల్ల విటమిన్లు పోతాయి. ఈ రెండింటి మధ్య తేడాలు, ప్రోస్-కాన్స్‌లను చూద్దాం.
కొరుక్కొని తింటే ఏంటీ లాభం?
మొదట, నేరుగా కొరుక్కొని తినడం వల్ల కలిగే పరిణామాలు చూద్దాం. హార్వర్డ్ యూనివర్శిటీ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, పండ్లు తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు నియంత్రణలో ఉంచుతుంది. హార్ట్ డిసీజ్, డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది. పండ్లు తినే వారిలో ఫైబర్ ఇంటేక్ 20-30% ఎక్కువగా ఉంది, ఇది గట్ మైక్రోబయోమ్‌ను బలోపేతం చేస్తుంది. మైక్రోబయోమ్ అనేది గట్‌లోని బ్యాక్టీరియా, ఇది ఇమ్యూనిటీ, మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తుంది.
డాక్టర్ మార్క్ హైమాన్, అమెరికన్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్, "పండ్లు తినడం వల్ల చ్యూయింగ్ ప్రాసెస్ సాలివా ఎంజైమ్‌లను యాక్టివేట్ చేసి, డైజెస్టివ్ ప్రాసెస్ మెరుగుపరుస్తుంది. కట్ చేసిన పండ్లలో ఇది తక్కువ" అని చెప్పారు.
డెంటల్ హెల్త్: నేరుగా కొరుక్కొని తినడం వల్ల దంతాలు బలపడతాయి, జా మసాజ్ అవుతుంది. ఒక జపాన్ స్టడీ ప్రకారం, ఆపిల్, పియర్ హార్డ్ ఫ్రూట్స్ కొరుక్కొని తినడం వల్ల డెంటల్ ప్లాక్ 15% తగ్గుతుంది,
కొరుక్కొని తినడంలో హైజీన్ రిస్క్స్ కూడా ఉంటుంది. నేరుగా తినడం వల్ల పెస్టిసైడ్స్, డర్ట్ సమస్య ఉంటుంది. FDA గైడ్ ప్రకారం, పండ్లు వాష్ చేయకపోతే బ్యాక్టీరియా రిస్క్ ఉంది. కోసే ఫ్రూట్స్‌లో ఇది ఎక్కువ. ఎందుకంటే కట్టింగ్ వల్ల స్కిన్ బ్రేక్ అవుతుంది, బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ప్రకారం, కట్ ఫ్రూట్స్ లిస్టీరియా బ్యాక్టీరియా రిస్క్ పెంచుతాయి.
చాకుతో కోసుకొని తింటే నష్టమేంటీ?
చాకుతో కోసుకొని తినడం వల్ల జరిగే పరిణామాలు చూస్తే ఇది హైజీనిక్. జపాన్ స్టైల్ కట్టింగ్ వల్ల స్లో ఈటింగ్ ప్రమోట్ అవుతుంది, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ మెరుగవుతుంది. NPR స్టడీ ప్రకారం, కొన్ని వెజిటబుల్స్ కట్ చేయడం వల్ల పాలీఫినాల్స్ పెరుగుతాయి, కానీ ఫ్రూట్స్‌లో ఇది లిమిటెడ్.
అయితే, కట్టింగ్ వల్ల ఆక్సిజన్ ఎక్స్‌పోజర్ పెరిగి, విటమిన్ C, ఆంటీఆక్సిడెంట్స్ లాస్ అవుతాయి. కట్ ఫ్రూట్స్‌లో విటమిన్ C 10-25% తగ్గుతుంది. ఎంజైమాటిక్ బ్రౌనింగ్ వల్ల క్వినోన్స్ ఫార్మ్ అవుతాయి, ఇది న్యూట్రియంట్స్ డిగ్రేడ్ చేస్తుంది.
నిపుణుల వివరణ: మాయో క్లినిక్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ డోనాల్డ్ హెన్స్రుడ్, "కట్ ఫ్రూట్స్ ఇమ్మీడియట్‌గా తినకపోతే ఆక్సీడేషన్ వల్ల న్యూట్రియంట్ లాస్ జరుగుతుంది. పూర్తి పండ్లు ఎక్కువకాలం ప్రిజర్వ్ అవుతాయి." PMC స్టడీలో, కట్ పైనాపిల్, వాటర్‌మెలన్‌లో విటమిన్ C లాస్ 5-12% ఉంది.
నేరుగా కొరుక్కొని తినడం వల్ల పీల్స్ వేస్ట్ తక్కువ, కంపోస్టింగ్ సులభం. కట్ ఫ్రూట్స్ ప్యాకేజింగ్ వల్ల ప్లాస్టిక్ వేస్ట్ పెరుగుతుంది, ఇది ఎకో-ఫ్రెండ్లీ కాదు. కట్ ఫ్రూట్స్ సెన్సరీ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయి.
ఇంతకీ ఏది మంచిది?
రెండు విధానాలకూ ప్రయోజనాలు ఉన్నాయి. నేరుగా కొరుక్కొని తినడం మైక్రోబయోమ్, డెంటల్ హెల్త్‌కు మంచిది కానీ, వాష్ చేయాలి. కట్టింగ్ సులభం కానీ, ఇమ్మీడియట్‌గా తినాలి లేదంటే న్యూట్రియంట్ లాస్. అందుకే లా తినాలి అనేది సిట్యువేషన్ మీద ఆధారపడి ఎంచుకోండి. ఉదాహరణకు, ఆపిల్ నేరుగా కొరుక్కోండి, మాంగో కట్ చేయండి.





















