deadly Marburg virus : కరోనాను మించిన మరో వైరస్ - ఆఫ్రికా నుంచి వేట మొదలు పెట్టేసింది !
ఆఫ్రికాలో కరోనా కంటే ప్రమాదకమైన మరో వైరస్ బయటపడింది. దీని వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమయింది.
deadly Marburg virus : కరోనాతోనే ప్రపంచం మొత్తం జనాలు పోరాటం చేస్తున్న సమయంలో మరో ప్రమాదకర వైరస్ బయట పడింది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసింది. రెండు వారాల క్రితమే రెండు కేసులు నమోదు కాగా.. వ్యాధి సోకిన ఆ ఇద్దరు బాధితులు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. దీనిని ధ్రువీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇద్దరు బాధితులతో సన్నిహితంగా మెలిగిన 34 మందిని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచి, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
ఘనాలోని సదరన్ అశాంతి ప్రాంతంలో మార్బర్గ్ వైరస్‌కు సంబంధించి రెండు అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక విశ్లేషణ కోసం బాధితుల నుంచి నమూనాలను సేకరించారు. ఇద్దరు బాధితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి నిర్ధారణ కోసం సెనెగల్‌లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌కు నమూనాలను పంపించారు. స్థానికంగా ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్న కారణంగా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. చనిపోయిన ఇద్దరు బాధితుల్లోనూ డయేరియా, జ్వరం, వికారం, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
కండలు పెరగడానికి సింపుల్ ఎక్సర్‌సైజ్ - దీని గురించి ఇప్పటి వరకూ మీరు చూసి ఉండరు !
ఎబోలా కుటుంబానికి చెందిన వైరస్ మార్బర్గ్ గా గుర్తించారు. గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/వ్యక్తుల స్రావాలను నేరుగా తాకడం వల్ల లేదా అవి తాకిన ప్రదేశాలను ముట్టుకోవడం వల్ల మానవుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో ఇది బయటపడుతుంది. అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, ఆయసం వంటి లక్షణాలతో అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడతారు. ఏడు రోజుల్లోనే చాలా మంది బాధితుల్లో రక్తస్రావం కనిపిస్తుంది. అనంతరం ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గోటబయ - ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందంటే ?
మరణాల రేటు 88శాతం వరకూ ఉంటుంది. వైరస్ నివారణ, చికిత్సకు ఎటువంటి వ్యాక్సిన్లు లేదా యాంటీవైరల్ చికిత్స లేదు. లక్షణాలను బట్టి చికిత్స చేయడంతోపాటు అధిక ద్రవాలను అందించడం ద్వారా బాధితులకు ప్రాణాపాయం నుంచి రక్షించే ప్రయత్నం చేయవచ్చు. ఈ వైరస్ బాధితులకు జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కళ్లు కూడా ఎర్రగా మారడం, మూత్రంలోనూ రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.