India Corona Cases: కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయ్, పాజిటివిటీ రేటు ఎంతంటే?
India Corona Cases: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయ్?
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో 16,299 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...రికవరీ రేటు 98.53%కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించింది. ఆగస్టు 10వ తేదీన యాక్టివ్ కేసులు 1,28,261 కాగా...ఆగస్టు 11 నాటికి 1,25,076కు తగ్గింది. 24 గంటల్లో యాక్టివ్ కేసులు 3,185 మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసులు 0.28% మాత్రమేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకూ కొవిడ్ మరణాలు 5,26,879గా నమోదయ్యాయి. భారత్‌లో మొదటి కొవిడ్ మరణం 2020లో మార్చి నెలలో నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఆగస్టు 11న 4.58%గా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR లెక్కల ప్రకారం...ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 87 కోట్ల 92 లక్షల 33 వేల 251 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీటిలో 3లక్షల 56 వేల 153 శాంపిల్స్ టెస్ట్ ఆగస్టు 10వ తేదీన జరిగింది.
𝐂𝐎𝐕𝐈𝐃-𝟏𝟗 𝐓𝐞𝐬𝐭𝐢𝐧𝐠 𝐔𝐩𝐝𝐚𝐭𝐞. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/auGvJsiqG1
— ICMR (@ICMRDELHI) August 11, 2022
ముంబయిలోనే ఎక్కువ కేసులు
ముంబయిలో ఆగస్టు 10వ తేదీన 852 కరోనా కేసులు నమోదయ్యాయి. జులై 1వ తేదీ తరవాత ఈ స్థాయిలో కేసులు నమోదైంది మళ్లీ ఇప్పుడే. జులై1వతేదీన ముంబయిలో 978 కేసులు నమోదు కాగా..ఇద్దరు మృతి చెందారు. ఈ నెల మొదటి వారం నుంచే ముంబయిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది. రోజూ కనీసం 400 కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే కేసుల సంఖ్య 79% మేర పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య మొన్నటి వరకూ 3,500గా ఉండగా, అది 3,545కి పెరిగింది. ఆగస్టు 10న కరోనా బారిన పడిన 852 మందిలో 36 మందిలోనే కొవిడ్ లక్షణాలు కనిపించాయి. మిగతా వాళ్లంతా అసింప్టమేటిక్ అని బృహణ్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది.
Also Read: Suicide Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి! ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి - ఇద్దరు సైనికుల వీరమరణం
Also Read: తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్‌లో పతకం- ఎమోషనల్ అయిన ద్రోణవల్లి హారిక